- 8-12-2009
- మార్కెట్ నాడి
సమస్యలకి ఒకే సారి చుట్టు ముట్టే గుణం ఉంటుందని నేటి ట్రేడింగ్ లో మరొక సారి నిర్ధారణ కానున్నది. గత రాత్రి అమెరికా ఫెడ్ అధ్యక్షులు బెర్నంకే తమ ప్రసంగం లో అమెరికా లో పరిస్థితి ఇంకా మెరుగు పడలేదని, లేబర్ మార్కెట్ కోలుకోవాలని, క్రెడిట్ దొరకటం దుర్లభం గా ఉందని చెప్పటం తో అక్కడి మార్కెట్లు ఒక్క సారిగా కుదేలు మన్నాయి. ఈ ప్రభావం వలన నేటి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాట పట్టాయి. జపాన్ లో క్షీణిస్తున్న ఆర్ధిక వ్యవస్థని స్థిరపరిచే దిశా గా ఎట్టకేలకు జపాన్ ప్రభుత్వ, $81 బిల్లియన్ల ఉద్దీపన ప్యాకేజి ప్రకటించింది. ఐనప్పటికీ అక్కడి మార్కెట్లు సానుకూలం గా స్పందించక , నష్టపోతున్నాయి. కాగా దుబాయి వరల్డ్ ఉదంతం లో మరో రెండు కీలక విషయాలు చోటుచేసుకున్నాయి. అక్కడి ప్రభుత్వం , ప్రస్తుత సమస్య పరిష్కారం భాద్యత దుబాయి వరల్డ్ సంస్థ దే అని చేతులు దులి పేసు కుంది . కాగా ఆ సంస్థ తమ భూములను అప్పు ఇచ్చిన బ్యాంకులకు, క్రేడిటర్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఆ భూముల విలువ అంతగా లేకపోవటం , చట్టపరమైన జాప్యం మున్నగు అంశాల వలన , రియల్ ఎస్టేట్ బుడగ ఏర్పడే ప్రమాదాన్ని సూచిస్తోంది. ఆస్ట్రేలియా లో Q 3 తాలూకు కరెంట్ ఎకౌంటు లోటు పెరిగిందన్న వార్త కూడా ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్ ని బలహీన పరుస్తున్నాయి.
మన దేశం కూడా తన వంతు కృషి చేస్తూ, రిజర్వు బ్యాంక్ డెప్యుటి గవర్నర్ , కీలక వడ్డీ రేటు ని పెంచే దిశ గా బ్యాంకు కసరత్తు చేస్తున్నదని ప్రకటించటం అగ్గి లో ఆజ్యం పోసినట్లయ్యింది.
ఈ కారణాల వలన నేడు మన మార్కెట్లు బలహీనం గా ట్రేడ్ అయ్యే సూచనలు ఉన్నాయి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16983
- అవరోధాలు: 16978-17002-17124-17240
- మద్దత్తులు:16844-16686-16454 -16264