ముఖ్య గమనిక website మేంటైనన్స్ జరుగుతున్న కారణం గా , నేడు అప్పుడప్పుడు లోపలి పేజీలు పనిచేయకపోవచ్చు. చదువరుల ఉపయోగార్థం " సలహాలు" హోం పేజిలో కూడా ప్రచురిస్తున్నాము

  • 16-11-2009
  • మార్కెట్ నాడి
ఎపెక్ దేశాల సమావేశాల లో ఉద్దిపనలు కొనసాగించాల్సిందే అని నాయకులు ముక్త కంఠం తో నిర్ణయం తీసికోవటం తో నేడు ఆసియా మార్కెట్లు లాభాల బాట లో నడుస్తున్నాయి. గత శుక్రవారం అమెరికా మార్కెట్ల లో , పెరుగుతున్న చిల్లర అమ్మకాలు, నూతన గృహ నిర్మాణ ప్రారంభాలు మున్నగు అంశాల వలన సెంటిమెంట్ బలపడి లాభాల లో పయనించాయి . అమెరికా మార్కెట్ల లో గత ట్రేడింగ్ లో లిస్టింగ్ ఐన కొత్త IPO వాటాలు కూడా లాభాలు గడించటం తో మదుపర్ల అమెరిఒక్యా మెరుగుపడుతున్నదన్న సూచనలను తెలియచేస్తున్నాయి.
సానుకూల ప్రపంచ వాతావరణం నేపధం లో మన మార్కెట్లు కూడా జోరందుకునే అవకాశాలు వున్నాయి. ముఖ్యం గా SAIL, NTPC, NMDC , REC, COAL ఇండియా మున్నగు కంపనీల వాటాలను విక్రయించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నందున వాటాల తో సహా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు కూడా నేడు లాభపడే అవకాశం ఉంది.
ఐతే శ్రీలంక లో పర్యటిస్తున్న ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖర్జీ , పెరుగుతున్న విలువలు నీటి బుడగల వంటివని వ్యాఖ్యానించటం, నేడు మార్కెట్ల లో ని భల్లుకాలకి ( BEARS కి ) కొంత యుద్ధ సామగ్రి ని అందించి నట్లయ్యింది.
సానుకూల ప్రపంచ మార్కెట్ల కి అనుసంధానం గా నేడు మన మార్కెట్లు కూడా పయనించ వచ్చు .
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16848
  • అవరోధాలు: 16978-17014-17373
  • మద్దత్తులు:16844-16680-16494

16-11-2009 -- సలహాలు

  • NETWORK 18 ఈ కౌంటర్ CMP రూ. 85.75 /- ఈ కౌంటర్ సుమారు రూ. 92 /- వరకు పెరిగే సూచనలు ఉన్నాయి. కాగా ఈ కౌంటర్ నకు సమీప మద్దత్తు రూ. 76. 25 వద్ద వుంది. కాబట్టి తగిన స్టాప్ లాస్ పెట్టుకోవటం అతి ముఖ్యం.
  • INDRAPRASTHA GAS LTD (INTRADAY) ఈ కౌంటర్ అమ్మకాల వత్తిడి కి గురి అవుతున్నందున , ఈ కౌంటర్ మరింత క్షీణించి రూ. 157.35వరకు చేరుకునే అవకాశం ఉంది. cmp Rs. 160.35 /- STOP LOSS RS. 162/-
  • GOLDEN TOBACCO ( డెలివరీ కాల్) ఈ కౌంటర్ గత ముగింపు రూ. 114.85 /- ఈ కౌంటర్ మరింతగా పెరిగి రూ. 132 /- వరకు చేరుకునే అవకాశం ఉంది.