• మార్కెట్ ముందుచూపు
  • 16 -11- 2009 నుండి 20-11-2009

గత వారం ముగిసిన జి- 20 దేశాల సమావేశాల లో ఉద్దీపణలు కొనసాగించాలని చేసిన తీర్మానం వలన ,అప్పటివరకు నష్టాల బాట లో నడిచిన మార్కెట్ల లో తిరిగి బుల్ల్స్ హవా కొనసాగి సుమారు 700 పాయింట్లు బలపడింది. చైనా, భారత దేశాల IIP ( పారిశ్రామిక ఉత్పతి) గణాంకాల లో గణనీయమైన పెరుగుదల నమోదు కావటం తో మార్కెట్లు లాభాపడెందుకు దోహద పడ్డాయి. ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలు పెద్దగా లేనందున మన మార్కెట్లు ప్రపంచ మార్కెట్ల కి అనుసందానమయ్యే అవకాశం ఉంది. శని వారం విడుదల అయిన ద్రవ్యోల్బన ఫలితాలు కొంత మేరకు మార్కెట్ల లో నెలకొని ఉన్న బుల్ల్స్ హవా ని కట్టుదిట్టం చేయవచ్చు. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల లో అక్టోబర్ ద్రవ్యోల్బణం 1.38% పెరిగింది. నెలవారీ గణాంకాలు విడుదల కావటం ఇదే ప్రథమం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మార్కెట్లకు కొంత అందోళన కలిగించే అంశం. గత వారం లాగే, ఈ వారం కూడా మన మార్కెట్లు కొనుగోళ్ళ పై ప్రధానం గా విదేశి సంస్థాగత మదుపర్ల పై ఆధపదనున్నది. ముఖ్యం గా U K రేటింగ్ ని “ ఫిషేర్” సంస్థ తగ్గిచవచ్చ్చన్న వార్త వినవస్తోంది. ఇదే జరిగి తే FII లు తమ పెట్టు బడి ని UKనుండి, చైనా, భారత వంటి ఆసియా దేశాలకి తరలించ వచ్చు . ఈ అంశం మన మార్కెట్లకు లాభదాయకం. గతవారం లాగే ,ఈ వారం కూడా ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్ల లో కొంత సంచలనం సృష్టించ వచ్చు . దేశ ప్రధాని మన్ మోహన్ సింగ్ NTPC, REC మున్నగు సంస్థల లో వాటాలను మరికొంత , ఈ సంవత్సరాంతానికి అమ్మివేయాలని యోచన, సుట్లేజ్ జై ని లిస్టింగ్ చేయాలని ఆలోచన పట్ల మార్కెట్లు సానుకూలం గా స్పందించనున్నాయి .గత కొన్ని వారాలుగా తీవ్ర నష్టాలను ఎదుర్కున్న టెలికాం స్టాకు ల లో ఈ వారం కొంత కొనుగోళ్ళు కనిపించవచ్చు. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయే అవకాశాలు ఉన్నందున CAIRN నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. టెక్నికల్ గా గత వారం సెన్సెక్స్ 30 DMAవద్ద మద్దత్తు తీసుకున్నది. సెన్సెక్స్ నకు ఈ వారం 16683 , ఆ తరువాత 50 DMA ఐన 16512 పాయింట్ల మద్దత్తు కీలక పాత్ర పోషించ నున్నది. 17041-17373-17457 సెన్సెక్స్ నకు కీలక అవరోధాలు కాగా 16512-16340-16252 -16113పాయింట్లు ముఖ్యమైన మదత్తు స్థాయిలు .