- 16-11-2009
- మార్కెట్ రిపోర్ట్
బలమైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లు ఆద్యంతం లాభాల బాట లో నడిచాయి. దీనితో బొంబాయి స్టాక్ సూచీ సెన్సెక్స్ 183 పాయింట్లు ఎగబాకి 17032 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ పాయింట్లు 59లాభ పడి 5058 పాయింట్ల వద్ద ముగిసింది.
నేడు మిడ్ క్యాప్ రంగం 1.14శాతం వృద్ధిని నమోదు చేయగా, స్మాల్ క్యాప్ రంగం 1.22శాతం లాభపడింది.
సేక్టరాల్ ఇండెక్స్ లను పరిశీలిస్తే , నేడు ఐ. టి. మినహా అన్నిరంగాలు లాభాలను ఆర్జించాయి. నేటి ట్రేడింగ్ లో రియాలిటి రంగం అత్యధికం గా 3.2 శాతం ఎగబాకింది.కాగా ఆటో రంగం కూడా 2.9శాతం లాభ పడి మదుపర్లకు లాభాల పంట పండించింది. కాగా ఐ, టి. రంగం మాత్రం స్వల్పం గా ౦.28 శాతం క్షీనించింది.
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే, నేడు MARUTI, DLF అత్యధికం గా 5.4 %, 4.5 % చొప్పున వృద్ధిని నమోదు .కాగా TCS 0.6 % , INFOSYS 0.3 % చొప్పున క్షీణించాయి.