ముఖ్య గమనిక
website మేంటైనన్స్ జరుగుతున్న కారణం గా , నేడు అప్పుడప్పుడు లోపలి పేజీలు పనిచేయకపోవచ్చు. చదువరుల ఉపయోగార్థం " సలహాలు" హోం పేజిలో కూడా ప్రచురిస్తున్నాము .- EDITOR
- 13-11-2009
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్ల లో ఎనర్జీ స్టాకులు కుదేలుమనటం తో అక్కడి మార్కెట్లు లాభాల నుండి నష్టాల లోకి జారుకున్నాయి. ఈ ప్రభావం నేడు ఆసియా మార్కెట్ల పై కూడా పడటం తో నేడు ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాటని పట్టాయి. మన మార్కెట్ల విషయం చర్చిస్తే, ప్రపంచ మార్కెట్ల కు అనుసంధానం గా నేడు కూడా మన మార్కెట్ల లో లాభాల స్వీకరణ జరిగే ఆస్కారం ఉంది. పైగా వారాంతం కనుక , ట్రేడర్లు తమ పెట్టుబడులను సోమ్ముచేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. UBS కుంబకోణం లో ADAG గ్రూపు కు చెందిన బ్యాంకు ఖాతాల లో సొమ్ము దుర్వినియోగం జరిగాయన్న వార్త కూడా మన మార్కెట్ల పై పిడిగుపాటు లా దెబ్బతీసే అవకాశం ఉంది. ఐతే చెక్కర దిగుమతుల పై సుంకం ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు ప్రకటించటం వలన నేడు SUGAR STOCKS లో సంచలనం కనిపించే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16696
- అవరోధాలు: 16754-16844-16978-17014
- మద్దత్తులు:16680-16494 -16340
- PIDILITE ఈ కౌంటర్ CMP RS. 174.95/- ఈ కౌంటర్ ఒకటి రెండు రోజుల లో రూ. 186 /- వరకు పెరిగే అవకాశం ఉంది. స్టాప్ లాస్ రూ. 171.20/-. ఈ కౌంటర్ నకు రూ. 169 /- , ఆ తరువాత రూ 164/- వద్ద విశేషమైన మద్దత్తు ఉంది. మార్కెట్లు భారిగా క్షీణిస్తే, సూచించిన స్థాయిల తో INTRADAY కూడా చేసుకోవచ్చు.
- ADVANTAA ఈ కౌంటర్ లో భారి కొనుగోళ్ళు కనవస్తున్నాయి. ఈ కౌంటర్ ప్రస్తుత ధర రూ. 572.75/- . నేటి ట్రేడింగ్ లో సుమారు RS 618/- ఆ తరువాత రూ 636 /- వరకు చేరుకునే అవకాశం ఉంది. వారం రోజుల వ్యవధి లో రూ 711/- వరకు చేరుకునే అవకాశం ఉంది. . STOP LOSS RS.558/-
- GULF OIL ఈ కౌంటర్ CMP రూ. 88.80. ఈ కౌంటర్ మరింత గా క్షీణించి సుమారు రూ. 81 /- వరకు చేరుకునే అవకాశం ఉంది. స్టాప్ లాస్ రూ. 91/-