- 13-11-2009
- మార్కెట్ రిపోర్ట్
ప్రపంచ మార్కట్లు ప్రతికూలంగా వున్నప్పటికీ , నేడు మన మార్కెట్లు అనూహ్యం గా లాభపడ్డాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 153 పాయింట్లు లాభపడి 16848 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది , నేటి ఉదయం మేము సూచించిన కీలక అవరోధమైన 16844 పాయింట్ల కి అతి చేరువగా ఉండటం విశేషం. నేడు నిఫ్టీ 46పాయింట్లు లాభ పడి 4999 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు సెన్సెక్స్ 0.92 శాతం, నిఫ్టీ 0.93 శాతం మేరకు ఎగబాకాయి.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.02 % స్వల్పం గా వృద్ధి చెందగా, స్మాల్ క్యాప్ రంగం ౦.20 % మేరకు లాభపడింది. సేక్టరాల్ ఇండెక్స్ లను పరిశీలిస్తే, నేడు మెటల్స్ 1.66 % ఎగబాకటం విశేషం , కాగా ఐ.టి రంగం 1.51 % మేరకు లాభాలను ఆర్జించాయి. కాగా నేడు రియాలిటి రంగం ౦.90 % క్షీణించగా , కన్సుమేర్ ఇండెక్స్ 0.87 % నష్టపోయింది.
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే, నేడు హీరో హోండా , మారుతి 4% చొప్పున ఎగబాకాయి. కాగా JP అసోసియేట్స్ 2 %, MNM 0.7 % చొప్పున నష్టపోయాయి.