• 12-11-2009
  • మార్కెట్ రిపోర్ట్

బలహీనమైన ఆసియా మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్ల లో ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుంది. దీనితో మన మార్కెట్లు భల్లుకాల బారిన పడ్డాయి. దీనితో సెన్సెక్స్153 పాయింట్లు కోల్పోయి 16696 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 51 పాయింట్లు క్షీణించి 4953 పాయింట్ల వద్ద ముగిసింది.

ఆరంభం నుండి బలహీనం గా ప్రారంభమైన మార్కెట్లు , మధ్యాన్నం అంచనాలను మించి ఉత్తమ IIP గణాంకాలు 9 .1 % వృద్ధి ని నమోదు చేస్తూ విడుదలకావటం తో కొంత మేరకు పుంజుకునే ప్రయత్నం చేసాయి. కాని , గత కొన్ని రోజులు గా బ్యాంకింగ్ రంగం లో అత్యంత భారి గా లాభ పడ్డ SBI, ICICI వాటాలు ప్రాఫిట్ బుకింగ్ కి గురికావటం తో మార్కెట్లు మరల రెడ్ మార్కు లో కి ప్రవేశించాయి. దీనితో , ఒక దశ లో సెన్సెక్స్ కనిష్టం 16605 గా పాయింట్ల వరకు క్షీణించింది. . ఇది మేము ఉదయం సూచించిన కీలక మద్దత్తు స్థాయి అయిన పాయింట్లకు అత్యంత సమీపంగా ఉండటం విశేషం. ఈ మద్దత్తు నుండి మార్కెట్లు తిరిగి కొంత కోలుకోని చివరికి 16696 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.93 శాతం క్షీణించగా , స్మాల్ క్యాప్ రంగం 0.27 శాతం క్షీణించింది. సేక్టరాల్ ఇండెక్స్ లను పరిశీలిస్తే, నేటి ట్రేడింగ్ లో ఐ.టి రంగం ౦.83 % లాభపడగా , టెక్ రంగం 0.74 % వృద్ధిని నమోదు చేసింది. కాగా రియాలిటి నేడు అత్యధికంగా 3.05 % నష్టపోయింది . మెటల్స్ రంగం రియాలిటి రంగానికి తోడుగా నిలుస్తూ 2.63 % క్షీణించింది.

సెన్సెక్స్ స్టాకు ల లో నేడు RCOM 1.9 %, WIPRO 1.4 % చొప్పున లాభపడగా, SBI 3.5 %, DLF 3.4 % చొప్పున నష్టాలను చవిచూసాయి.