ముఖ్య గమనిక website మేంటైనన్స్ జరుగుతున్న దృష్యా , నేడు అప్పుడప్పుడు సలహా పేజి పనిచేయకపోవచ్చు. చదువరుల ఉపయోగార్థం " సలహాలు" హోం పేజిలో కూడా ప్రచురిస్తున్నాము .-- EDITOR

  • 12-11-2009
  • మార్కెట్ నాడి

ప్రపంచ మార్కెట్ల లో నలకొన్న జోరు గత రాత్రి అమెరికా మార్కెట్ల లో కూడా కనిపించింది. నిన్న అమెరికా మార్కెట్లు కూడా కొద్దిపాటి లాభాలను ఆర్జించాయి. అమెరికా మార్కెట్ల లో లగ్జరీ గృహ నిర్మాణ సంస్థ భారి లాభాల తో pఫలితాలు భారిలాభాల తో ప్రకటించటం తో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్ ఇండెక్స్ MSCI కూడా ప్రపంచ వ్యాప్తం గా మదుపర్ల సెంటిమెంట్ బలపడుతోందని సూచిస్తోంది. నేటి ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే, జపాన్ లో డిరివెటివ్స్ హేడ్జింగ్ కంపనీ AIFUL ఖాతాదారులకు సొమ్ము తిరిగి చెల్లించలేని పరిస్థితి తెచ్చుకోవటంతో అక్కడి మార్కెట్లు కొంత ఆటు పోట్లకిగురవుతున్నాయి.

    మన దేశానికి సంబంధించిన అంశాలను పరీక్షిస్తే , నేడు పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు విడుదలకానున్నాయి. మన మార్కెట్ల తదుపరి గమనానికి ఈ ఫలితాలు అత్యంత కీలకం. ఇది ఆశాజనకం గా ఉంటే మన మార్కెట్ల లో మరింతగా బుల్ల్స్ హవా కొనసాగే అవకాశం ఉంది. అదే విధం గా నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. ఇక పై ఈ గణాంకాలు ప్రతీ వారం కాక నెలసరి విడుదల కానున్నాయి.

    టెక్నికల్ గా పరిశీలిస్తే మన మార్కెట్లు , నిన్నటి ట్రేడింగ్ లో 15 dma ని దాటటం వలన స్వల్ప కాలిక అప్ ట్రెండ్ లో ఉండే అవకాశం ఉంది. పై గా , సెన్సెక్స్, అతి కీలక 16680 అవరోధం చేదించటం కూడా ఇందుకు మరింత గా సహకరించనుంది. ఐతే నేడు విడుదల కానున్న పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలే అత్యంత కీలకం

    • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
    • గత ముగింపు: 16849
    • అవరోధాలు: 16844-16978-17014-17124
    • మద్దత్తులు:16754-16613-16494
    • 12-11-2009
    • "సలహాలు "
    • KSK ENERGY ఈ కౌంటర్ ప్రస్తుత ధర రూ. 199.50/-. ఈ కౌంటర్ ఒకటి రెండు రోజుల లో మరికొంత పెరిగి సుమారు రూ. 216 /- వరకు పెరిగే సూచనలు ఉన్నాయి. రూ. 189.30 వద్ద బలమైన మద్దత్తు ఉంది. తగిన స్టాప్ లాస్ ఎంచుకొని ట్రేడ్ చేసుకోవచ్చు.
    • ARSHIYA INTERNATIONAL ఈ కౌంటర్ లో భారికోనుగోల్లు చోటుచేసుకుంటున్న దృశ్యా , ఈ కౌంటర్ నేటి ట్రేడింగ్ లో మరికొంత పెరిగే అవకాశం ఉంది. CMP RS. 140.45 /- ఈ కౌంటర్ నకు రూ. 145 /- వద్ద అవరోధం ఉంది. ఇది చెదించ గలిగితే రూ. 155 /- వరకు చేరుకోవచ్చు.

    • HINDUSTAN ORGANICS - BSE CODE : 500449 ఈ కౌంటర్ CMP RS. 41.95. ఈ కౌంటర్ నేటి ట్రేడింగ్ లో రూ. 40.40/- వరకు పడిపోయే అవకాశం ఉంది. సుమారు రూ. 43.70 /- వద్ద షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. అప్పుడు స్టాప్ లాస్ రూ. 44. 40/-