- 11-11-2009
- మార్కెట్ రిపోర్ట్
నేటి ఉదయమే మేము సూచించిన విధం గా మార్కెట్లు , మా అంచనాలను నిజం చేస్తూ లాభాల బాట లో నడిచాయి. సానుకూల ఆసియా మార్కెట్ల ప్రభావం వలన, ముఖ్యం గా చైనా పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు అత్యుతమం గా ఉండటం వలన, అక్టోబర్ మాసం లో మన దేశం లో కార్ల అమ్మకాల జోరు గా జరిగిందన్న గణాంకాల వలన మన మార్కెట్ల సెంటిమెంట్ బలపడి ,లాభాల బాట లో పయనించాయి. ఎప్పటిలాగే, ఈ రోజు కూడా సెన్సెక్స్ ,మేము ఉదయమే సూచించిన 16844 పాయింట్ల కీలక స్థాయి కి అతి సమీపం గా ...16849 పాయింట్ల వద్ద ముగియటం విశేషం. సెన్సెక్స్ నేడు 2.49 % వృద్ధిని నమోదు చేస్తూ 409 పాయింట్ల లాభాన్ని అర్జించింది. కాగా నిఫ్టీ 122 పాయింట్లు లాభ పడి , 5003 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 2.5 శాతం మేరకు వృద్ధి చెందింది. నిఫ్టీ ఐదు వేల మార్కు దాటి ముగియటం నేటి విశేషం.
ఉదయం మందకొడి గా ప్రారంభించిన మార్కెట్లు స్వల్పంగా కోల్పోయి 16405 పాయింట్ల కనిష్ట స్థాయి కి చేరుకుంది. కాని మా అంచనాలని నిజం చేస్తూ మరల భారి లాభాలను అర్జించింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2 శాతం లాభ పడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.6 శాతం మేరకు వృద్ధి చెందింది. నేటి ట్రేడింగ్ లో అన్ని సేక్టరాల్ ఇండెక్స్ లు లాభపడటం విశేషం. మెటల్స్ రంగం అత్యధికం గా 4.27 శాతం ఎగబాకింది. ఐ.టి ఇండెక్స్ కూడా ఇన్ఫోసిస్ లాభ పడటం తో 3.94 శాతం మేరకు వృద్ధి చెందింది.
సెన్సెక్స్ స్టాకు లను పరీక్షిస్తే నేడు అన్ని సెన్సెక్స్ స్టాకులు లాభాలను ఆర్జించటం విశేషం. నేటి ట్రేడింగ్ లో STERLITE INDUSTRIES , JP ASSOCIATES అత్యధికం గా 6.5 %, 6. 3 % లాభాలను ఆర్జించాయి.