22-11-2009
  • మార్కెట్ ముందుచూపు
  • (23-11-2009 నుండి 27-11-2009 వరకు )

గత వారం చివరలో విదేశీ సంస్థాగత మదుపర్ల కొనుగోళ్ళ నేపధ్యం లో మార్కెట్లు నష్టాల నుండి లాభ లో కి ఎగబాకాయి. మధ్య మధ్య లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకున్నప్పటికీ, ప్రణాలికా సంఘం ఉపాధ్యక్షులు మోన్ టెక్ సింగ్ ఆహువలియా , FII ల పై పన్ను విధించబోమని స్పష్టం చేయటం ..మార్కెట్లు లాభాపడెందుకు కారణమయ్యాయి. దీనితో సెన్సెక్స్ మరొక సారి 17 వేల మార్కు ని దాటి ముగియటం విశేషం.

ఈ వారం ప్రభావితం చేయబోయే అంశాలను గమనిస్తే , ప్రభుత్వం ఆర్ధిక సంస్కరణ లో భాగం గా బ్యాంకింగ్ మరియు ఇన్సురన్సు రంగాల పై చేయబోయే ప్రకటన అత్యం త కీలకమని చెప్పవచ్చ్చు. ఇన్సూరెన్స్ బిల్లు లో భాగం గా , ఇన్సురన్సు కంపనీలలో , విదేశీ సంస్థల వాటా ని ప్రస్తుతం వున్న 26 % నుండి 49 % శాతం వరకు పెంచే యోచన పై ప్రభుత్వం చేయబోయే ప్రకటనలు మార్కెట్ ని ప్రభావితం చేయనున్నాయి. ప్రాధమిక సమాచారం ప్రకారం ఈ శీతాకాల సమావేశాల లో పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని ముందుగా యోచన చేసినప్పటికీ, బహుశా ఈ సమావేశాల లో ఈ అంశం చర్చించక పోవచ్చన్న అంచనాల తో గత వారం ఇన్సురన్సు విభాగాలను నడిపిస్తున్న HDFC. ICICI, MAX మున్నగు వాటాలు నష్టపోయాయి. పైగా ఇన్సురన్సు బిల్లు తో బాటు ఇన్సురన్సు ఏజెంట్ల కమీషన్ పై స్వరూప్ కమిటి నివేదిక కూడా అత్యంత లోప బ్రష్టం గా ఉండటం వలన కూడా ఇన్సురన్సు బిల్ పై చర్చ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఎదురైతే, ఇన్సురన్సు కంపనీ ల వాటా లు కొంత వత్తిడికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం పార్లమెంట్ లో ప్రభుత్వ రంగ బ్యాంకు ల లో ప్రభుత్వ వాటా ని తగ్గించు కోవాలన్న అంశం పై, పెన్షన్ రెగ్యులేటర్ పై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం చిన్న పాటి బ్యాంకు ల వాటాలు ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. పైగా రిజర్వు బ్యాంక్ , బ్యాంకులు తమ NPA మేరకు నిధులను సమకూర్చు కునేందుకు మరో రెండు త్రైమాసాల వ్యవధిని పొడిగించినట్లు ప్రకటించటం కూడా , ఇందుకు దోహద పడనున్నాయి.

కంపనీల అంశాలను పరిశీలిస్తే, ఈ వారం టాటా మోటర్స్, టాటా స్టీల్ తమ ఫలితాలను వెల్లడి చేయనున్నాయి. ఈ ఫలితాలను మార్కెట్లు ఆసక్తి తో గమనించనున్నాయి. ఈ వారం లో F & O ముగింపు కారణం గా మార్కెట్ల లో తీవ్రత కనపడనున్నది. ఈ వారం ప్రారంభం లో మార్కెట్లు పెరిగితే, F & O ముగింపున మార్కెట్లు మరల తగ్గ వచ్చు . అదే విధం గా ఈ వారం ప్రారంభం లో షార్ట్లు ఏర్పడితే, ముగింపున షార్ట్ కోవేరింగ్ జరిగేందుకు ఆస్కారాలు ఉన్నాయి. షార్ట్ కవేరింగ్ మూలాన రియాలిటి స్టాకు లు లాభపడే అవకాశాలు ఉన్నాయి.

మన దేశ రెండవ త్రై మాసిక GDP లో తగ్గుదల కనపడవచ్చన్న అంచనాలు వెలవడుతున్నాయి .ఈ అంశం పై మరిన్ని వివారాలు ఈ వారం రానున్నాయి. ఈ విషయం మార్కేట్లని ప్రభావితం చేయనున్నాయి.

ఇక ప్రపంచ మార్కెట్లను పరిశీలిస్తే, ఈ మంగళ వారం అమెరికా మార్కెట్ల ముందస్తు GDP గణాంకాలు వెలువడనున్నాయి. ఈ అంశం మన మార్కెట్ల నే కాక ప్రపంచ మార్కెట్లను కూడా ప్రభావితం చేయనున్నది. ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు మన మార్కెట్ల పై ఎప్పటి లాగే, ఈ వారం కూడా ప్రభావితం చేయనున్నాయి.

టెక్నికల్ గా పరిశీలిస్తే , ఈ వారం 17240-17490-17620-17824 సెన్సెక్స్ నకు కీలక అవరోధాలు కాగా 30 DMA ఐన 16686 , 75 DMA ఐన 16264 పాయింట్లు సెన్సెక్స్ నకు కీలక మద్దత్తులు .16844,16756, 16454 చోపుకోదగ్గ ఇతర మద్దత్తు స్థాయిలు.