- 23-11-2009
- మార్కెట్ నాడి
గత వారం ముగింపు న ప్రపంచ మార్కెట్లు నష్టాల లో పయనిస్తున్నపటికీ, మన మార్కెట్లు లాభాల లో పయనించాయి. ఆసియా దేశాలు , విదేశీ పెట్టుబడులను నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. బలపడుతున్న స్థానిక కరన్సీ ల నుండి అక్కడి ఎగుమతిదారులకు ఉపశమనం కలిగించే విధం గా ఆసియా దేశాలు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఐతే, మన దేశం అటువంటి నియంత్రణలు చేపట్టబోమని ప్రభుత్వం స్పష్టం చేయటం వలన మన మార్కెట్ల లో నెలకొని ఉన్న ఉత్సాహం నేడు కూడా కొనసాగవచ్చు. అమెరికా మార్కెట్ల లో నేటి నుండి రాగల మూడు రోజుల పాటు ట్రెజరీ బిల్లుల వేలం జరగనున్నది. బిల్లుల వడ్డీ రేటు నానాటికీ క్షీణిస్తూ, స్టాక్ మార్కెట్లు లాభపడటం వంటి అంశాలను పరిశీలిస్తే, అక్కడి మార్కెట్ల లో DIVERGENCE ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ అంశం రాగల రెండు మూడు రోజుల లో మరికొంత ప్రాధాన్యత సంతరించుకోవచ్చు
పై అంశాలను మన మార్కెట్ల తో సమన్వయ పరుచుకుంటే, మన మార్కెట్లు దాదాపు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కాబట్టి ఒకటి రెండు రోజులలో, అమెరికా మార్కెట్ల కి అనుగుణం గా మరల ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. కాబట్టి మదుపర్లు కొంత అప్రమత్త తో వ్యవహరించటం మంచిది. మార్కెట్లు పెరిగినప్పుడు , గరిష్ట స్థాయి ల లో అమ్ముకోవటం మంచిది. నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా పయనిస్తున్నా ,ఇతర ఆసియా మార్కెట్ల నుండి తరలి వచ్చే FII ల పెట్టుబడుల వలన నేడు మన మార్కెట్లు కొంత పుంజుకోవచ్చు. ఐతే గరిష్ట స్థాయిల లో ప్రాఫిట్ బుకింగ్ కి ఆస్కారం కూడా ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17021
- అవరోధాలు: 17124-17240-17373-17490
- మద్దత్తులు:17002-16978-16844-16680
ముఖ్య గమనిక : హైదరాబాద్ నగర స్థానిక ఎన్నికల కారణం గా నేడు ( 23-11-2009 ) మా కార్యాలయానికి సెలవు. కావున నేటి సాయంత్రం "మార్కెట్ రిపోర్ట్" ప్రచురణ జరగదు. ఈ అంశం గమనించగలరు .