- 20-11-2009
- మార్కెట్ రిపోర్ట్
విదేశీ పెట్టు బడుల పై ఎటువంటి పన్ను విధించబోవటం లేదని ప్రణాలికా సంఘం ఉపాధ్యక్షులు మోన్టెక్ సింగ్ అహూవాలియా ప్రకటించటం తో నష్టాల లో కూరుకు పోయిన మార్కెట్లు కోలుకొని , వరుసగా మూడవ వారం లాభాల లో ముగించాయి. దీనితో సెన్సెక్స్ 236 పాయింట్లు లాభ పడి 17021 పాయింట్ల కు ముగియగా, నిఫ్టీ 63పాయింట్లు లాభ పడి 5052 పాయింట్ల వద్ద ముగిసింది.
బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నష్టాల తో , 16772పాయింట్ల వద్ద ప్రారంభం చేసిన సెన్సెక్స్ , ఒక దశ లో కనిష్టం గా 16634పాయింట్ల వరకు పడిపోయింది. ఐతే, మోన్ టెక్ సింగ్ ప్రకటన తో మార్కెట్లు మరల పుంజుకొని లాభాలను ఆర్జించింది. చివరికి 17021 పాయింట్ల వద్ద లాభాల తో ముగిసింది. ఇది , ఉదయం మేము సూచించిన కీలక స్థాయి ఐన 17014 పాయింట్ల స్థాయి కి అతి చేరువ గా ఉందని గమనించాలి.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.08 శాతం , స్మాల్ క్యాప్ రంగం 0.43శాతం లాభాలను ఆర్జించాయి. సేక్టోరల్ ఇండెక్స్ లను పరిశీలిస్తే, నేడు కన్సుమేర్ డ్యురబుల్స్ మినహా అన్ని ఇండిసిస్ లు లాభాల లో ముగిసాయి. ఈ ఇండెక్స్ మాత్రం 1.4% నష్టపోయింది. నేటి ట్రేడింగ్ లో బ్యాంకింగ్ ఇండెక్స్ 2 శాతం, చమురు మరియు గ్యాస్ ఇండెక్స్ 1.5 % మేరకు వృద్ధిని సాధించాయి.
సెన్సెక్స్ స్టాకు ల లో ACC, HINDALCO 4.6%, 3.5 % మేరకు లాభపడ్డాయి. కాగా అయిర్ టెల్ 1.4 %, రిలయన్స్ ఇన్ఫ్రా 0. 6 % నష్టపోయాయి. అయిర్ టెల్ STD రెట్ల లో 60 % తగ్గింపు ప్రకటించటం తొ ఈ కౌంటర్ నష్టపోయింది.
రేపు ఎల్లుండి మార్కెట్లకు సెలవు. ఐతే ప్రతీ ఆదివారం లాగే, ఈ ఆదివారం కూడా మార్కెట్ ముందు చూపు శీర్షిక ప్రచురణ జరుగుతుంది.