- 26-11-2009
- మార్కెట్ రిపోర్ట్
నవంబర్ F & O ముగింపు సందర్భం గా మార్కెట్లు అమ్మకాల వత్తిడి కి గురి అయ్యాయి. దీనితో ఉదయం మందకొడి గా ప్రారంభమైన మార్కెట్లు మధ్యాన్నం తరువాత భారి నష్టాలను నమోదు చేసాయి. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 345 పాయింట్లు కోల్పోయి 16854 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది నేటి ఉదయం మేము సూచించిన పాయింట్ల మద్దత్తు ఐన 16844 పాయింట్ల కి అత్యంత సమీపం గా ఉండటం గమనార్హం. నేడు నిఫ్టీ 102 పాయింట్లు కోల్పోయి 5005 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ట్రేడింగ్ లో రూ. 159267 కోట్ల మేరకు వ్యాపారం జరగటం కొత్త రికార్డు. నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల అయ్యాయి. నవంబర్ నెల 14తో ముగిసిన వారాంతంలో ఆహార పదార్థాల ధరల్లో ద్రవ్యోల్బణం పెరిగి 15.58 శాతానికి చేరుకుంది. ఇదే అంతకు మునుపు వారంలో ద్రవ్యోల్బణం 14.55 శాతంగా ఉండింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.4% , స్మాల్ క్యాప్ రంగం 1 % నష్టాలను నమోదు చేసింది.
ఆద్యంతం తమ సత్తా చాటిన ఎలుగుల దెబ్బ కి నేడు ఆని సేక్టరాల్ ఇండెక్స్ లు బావురుమన్నాయి. నెట్ ట్రేడింగ్ లో రంగం అత్యదికం గా 2.6 % నష్టపోగా, చమురు మరియు గ్యాస్ రంగం 2.3 % నష్టపోయింది. ఉదయం మా అంచనాలకి అనుగుణం గా రిలయన్స్ వాటాలు నష్టపోవటం తో ఈ రంగం మరింత గా క్రుంగిపోయింది. పైగా గత ఆది వారం "మార్కెట్ ముందుచూపు " శీర్షిక లో మేము ప్రస్తావించిన విధం గా నేడు మార్కెట్లు కోల్పోయి మా అంచనాలని మరొక సారి నిజం చేసాయి. మార్కెట్లు కోల్పోయినప్పటికీ , నవంబర్ నెలకి గాను సెన్సెక్స్ 5 %, నిఫ్టీ 5.4 % వృద్ధిని నమోదు చేయటం విశేషం
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే , నేడు టాటా స్టీల్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఇది మార్కేట్లని నిరాశపరిచే విధం గా ఉండటం తో ఈ కౌంటర్ నేడు భారి గా 3.3 % నష్ట పోయింది. కాగా ICICI బ్యాంక్ 3.4 % మేరకు నష్టపోయి అత్యధికం గా నష్టపోయిన సెన్సెక్స్ స్టాకు గా నిలిచింది. కాగా సన్ ఫార్మ, హిందూస్తాన్ యూని లివేర్ 0.8 % చొప్పున లాభపడి బుల్ల్స్ పరువును నిలబెట్టే ప్రయత్నం చేసాయి.