• 26-11-2009
  • మార్కెట్ నాడి
అమెరికా మార్కెట్ల లో నిర్యుద్యోగ గణాంకాలు , అక్కడి నిరుద్యోగ పరిస్థితి తగ్గుముఖం పడుతోందని సూచించటం , గృహ అమ్మకాలు పుంజుకోవటం మున్నగు కీలక అంశాలు విడుదలకావటం తో , అమెరికా మార్కెట్లు గత రాత్రి లాభాలను సాధించాయి. నేడు ఆసియా మార్కెట్లు ఇందుకు భిన్నం గా నష్టాల లో పయనిస్తున్నాయి .అమెరికా డాలర్ నానాటికి క్షీణించటం తో ఎగుమతులు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. అమెరికా డాలర్ విలువ పడిపోతున్నందున , పలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు పై మగ్గు చూపుతున్నాయి. ఈ కారణం గా కామోడిటిస్ , ముఖ్యం గా బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది. ఈ సంవత్సరాంతానికి అంతర్జాతీయ విపణి లో అవున్సు బంగారం $ 1200 చేరనున్నదని అంచనాలు వెలువడుతున్నాయి.
మన మార్కెట్ల పరం గా ఆలోచన చేస్తే , నేడు మన మార్కెట్ల లో ఈ నెల F & O ముగింపు కారణం గా , అంతర్జాతీయ పరిణామాలకి అతీతం గా మన మార్కెట్లు వ్యవహరించ నున్నాయి. నేటి మార్కెట్ల గమనం కేవలం రోల్ ఓవర్ల పై ఆధార పడనున్నది. నేడు రిలయన్స్ EX BONUS కానున్నది. కావున రిలయన్స్ కౌంటర్ లో స్వల్ప తగ్గుదల కూడా సెన్సెక్స్ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది కనుక , ఈ కౌంటర్ నేడు మన మార్కెట్ల మీద స్పీడ్ బ్రేకేర్ విధం గా పనిచేసే అవకాశం ఉంది
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17198
  • అవరోధాలు: 17240-17373-17490
  • మద్దత్తులు:17124-17002-16978-16844