- 27-11-2009
- మార్కెట్ నాడి
మరొక సారి క్రెడిట్ డిఫాల్ట్ ( అప్పు ఎగవేత ) ప్రపంచ మార్కెట్ల ని అతలా కుతలం చేయనుంది. దుబాయ్ వరల్డ్ అని పేరిట, దుబాయి ప్రభుత్వ రంగ సంస్థ 2008 న సుమారు $ 59 బిలియన్ ల అప్పు చేసి అక్కడి ఇన్ఫ్రా రంగ , గృహ నిర్మాణానికి గాను ఖర్చు చేసింది. రియల్ ఎస్టేట్ పడిపోవటం తో , డిసెంబర్ 14 న తిరిగి చెల్లించాల్సిన అప్పుని నింపాదిగా చెల్లించగలమని సంస్థ చెప్పటం తో యూరోప్ మార్కెట్లు నష్టాల లో కూరుకు పోయాయి. నేడు జాపాన్ మరియు ఇతర ఆసియా మార్కెట్లు కూడా ఇదే అంశం వలన నష్టాల లో పయనిస్తున్నాయి.
నోముర ఏజెన్సి , ఇది అప్పు ఎగవేత కోవకే చెందుతుందని తేల్చి చెప్పటం తో మరొక సారి ప్రపంచ మార్కెట్లు భయాందోళన కి గురి అవుతున్నాయి. ఈ దెబ్బ తో ముఖ్యం గా రియల్ ఎస్టేట్ ,ఇన్ఫ్రా రంగానికి చెందిన స్టాకు లు ప్రపంచ వ్యాప్తం గా కుదేలు మంటున్నాయి. రాత్రి అమెరికా థాంక్స్ గివింగ్ దివసం సందర్భంగా అక్కడి మార్కెట్లకు సెలవ ప్రకటించటం తో అవి ట్రేడ్ కాలేదు. నేటి సాయంత్రం అవి ట్రేడ్ అయినప్పుడు , దుబాయి వరల్డ్ పరిణామాన్ని అనుసరించిఅమెరికా మార్కెట్ల ప్రతిక్రియ కారణం గా సోమవారం నుండి ప్రపంచ మార్కెట్లు మరొక సారి భయోత్పాతానికి గురికావచ్చు. ముఖ్యం గా దుబాయ్ వరల్డ్ ప్రాజెక్ట్ తో ముడిపడి వున్న అమెరికా బ్యాంకులు , సంస్థల వివరాలు మనకు తెలియనున్నాయి. ఈ వివరాలను బట్టి , ఇన్ఫ్రా స్టాకు ల తరువాత , బ్యాంకు ల స్టాకు లు కూడా పతనానికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా డాలర్ లో చోటు చేసుకున్న బలహీనత కారణం గ ఎగుమతులు కరువై నష్టపోతున్న ఆసియా మార్కెట్ల పై దుబాయి వరల్డ్ ఉదంతం పిడుగుపాటు లా పడనున్నది.
నిన్న F & O ముగింపు కారణం గా , మధ్యాన్నం పూర్తి స్థాయి లో మన మార్కెట్లు దుబాయ్ వరల్డ్ కి ప్రతిక్రియ చూపలేదనే చెప్పాలి. కాని , నేడు ఈ అంశం వలన మన మార్కెట్లు కూడా నలుగురి తో నారాయణ అంటూ ప్రపంచ మార్కెట్ల తో అనుసంధానం గా నష్టపోనున్నాయి. కాబట్టి మదుపర్లు తమ పోజి షన్లని తగ్గించుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవటం పై దృష్టి సారించటం మంచిది . నేడు వారాంతం కనుక , ఇటువంటి ప్రపంచ వాతావరణం మధ్య రిస్క్ తీసుకోవటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16854
- అవరోధాలు: 16978-17002-17124-17240
- మద్దత్తులు:16844-16686-16454 -16264