- 25-11-2009 : 6 PM
- మార్కెట్ రిపోర్ట్
స్వల్ప నష్టం తో ప్రారంభమైన మార్కెట్లు నేడు ఆరంభ ట్రేడ్ లో నే లాభాల బాట పట్టి , చివరికి ఫ్లాట్ గా ముగిసింది. నేడు సెన్సెక్స్ 67 పాయింట్లు లాభపడి 17198 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 17 పాయింట్లు లాభ పడి 5108 పాయింట్ల వద్ద ముగిసింది . ప్రధానం గా నేడు సెన్సెక్స్ సుమో వీరుడు రిలయన్స్ లాభాల లో నడవటం తో సెన్సెక్స్ నిలదొక్కుకునేందుకు దోహద పడింది. మూతబడ్డ రిలయన్స్ పెట్రోల్ బంకులు తెరవనున్నట్లు చేసిన ప్రకటన కూడా రిలయన్స్ లాభాపడెందుకు కారణమయ్యింది. రేపు రిలయన్స్ EX BONUS కానున్నది.
నిన్న లాభపడ్డ స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ ఇండెక్స్ లు నేడు 0.2 % , 0.1 % చొప్పున నష్టపోయాయి. నేటి ట్రేడింగ్ లో రియాలిటి ఇండెక్స్ భారి గా నష్టాన్ని నమోదు చేసింది. ఈ ఇండెక్స్2.9 శాతం నష్టపోగా, హెల్త్ కేర్ రంగం 0.5 % క్షీణించింది. నేడు లాభపడిన ఇండెక్స్ ల లో చమురు మరియు గ్యాస్ రంగం 1.1 శాతం వృద్ధి చెందగా, FMCG 1.4 % మేరకు లాభాన్ని ఆర్జించింది. సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే HERO HONDA 2.2%, ITC 1.9 % లాభపడటం విశేషం. కాగా DLF 2.9 %, R COM 1.4 % మేరకు క్షీణించాయి.