- 25-11-2009
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు , వినియోగదారుల ఖర్చు ల గణాంకాలు నిరాశాకోల్పే విధం గా ఉండటం తో , నష్టాలబాట పట్టాయి. ఐతే, అమెరికా ఫెడ్ , Q 4 లో నిరుద్యోగం తగ్గనున్నట్లు అంచనాలు విడుదల చేయటం తో మరల కొద్దిగా కోలుకొని ఫ్లాట్ గా ముగిసాయి. నేటి ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే, జపాన్ లో ఎగుమతుల తగ్గుదల కనిష్టస్థాయి గా నమోదు కావటం, ముఖ్యం గా ప్రపంచ వ్యాప్తం గా కీలక వడ్డీ రేటు తగ్గి ఉండటం వలన ,ఎగుమతుల లో వృద్ధి నమోదు కావటం తో జపాన్ మార్కెట్ లాభాల లో పయనిస్తోంది. ఐతే ఇతర ఆసియా మార్కెట్లు ఒడిదుడుకుల తో పయనిస్తున్నాయి .
మన మార్కెట్ల పరంగా విశ్లేషిస్తే, రిజర్వు బ్యాంక్ , ఉద్దిపనలు క్రమేపి తగ్గించాలని, సరైన అదను చూసి వడ్డీ రేటు ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రకటించటం మన మార్కెట్ల ని కొంత నిరుత్సాహ పరచవచ్చు. పైగా ఇదే విధం గా ,మరొక సందర్భం లో అమెరికా ఫెడ్ అధ్యక్షులు ప్రస్తావిస్తూ , తగ్గించిన వడ్డీ కారణం గా స్టాకు ల లో SPECULATION కి దారి తీస్తున్న దని ప్రకటించటం గమనార్హం . నేడు కూడా మార్కెట్లు కొంత ఆటు పొట్ల గురియ్యే అవకాశాలు ఉన్నాయి. రేపు F & O ముగింపు కనుక ,మధ్యాన్నం తరువాత మార్కెట్ల లో తీవ్రత కనపడవచ్చు.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17131
- అవరోధాలు: 17240-17373-17490
- మద్దత్తులు:17124-17002-16978-16844