• 24-11-2009
  • మార్కెట్ నాడి

అంచనాలకి మించి అమెరికా నూతన గృహ అమ్మకాలు జరగటం తో ,గత రాత్రి అమెరికా మార్కెట్లు లాభపడ్డాయి. నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా పయనిస్తున్నాయి. దక్షిణ కొరియా లో వినియోగ దారుల విశ్వాస సూచీ తగ్గుముఖం పట్టటం తో ఆర్ధిక మాంద్యం తగ్గుదల కై మరింత సమయం పట్టవచ్చన్న అంచనాల తో మార్కెట్లు క్షీణిస్తున్నాయి. జపాన్ మార్కెట్ల లో , ప్రతిద్రవ్యో ల్బనం చోటు చేసుకోవటం, అక్కడి బ్యాంకు లు తమ వాటాలను విక్రయించటం మున్నగు అంశాల వలన జపాన్ మార్కెట్లు నష్టాల లోపయనిస్తున్నాయి . నిన్న "మూడి" సంస్థ మన బ్యాంకు ల పై సమర్పించిన నివేదిక కూడా ఆశా జనకం గా లేకపోవడం , ఈ సందర్భం లో గమనార్హం.

RPL ట్రేడింగ్ లో చోటు చేసుకున్న అవకతవకల గురించి SEBI , RIL నకు షో కాజ్ నోటిసు జారి చేయడం వలన ఈ కౌంటర్ లో , తద్వారా సెన్సెక్స్ లో , కొంత బలహీనత చోటు చేసుకునే అవకాశం ఉంది. కాగా మన మార్కెట్ల లో MARKET CAPITALISATION , GDP నిష్పత్తి గణనీయం గా నూరు పాయింట్ల ని మించి పెరగటం వలన మార్కెట్లు అతి త్వరలో దిద్దుబాటు కి గురియ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. గతం లో ఈ విధం గా సెన్సెక్స్ 21000 పాయింట్ల స్థాయి లో జరిగింది. కాబట్టి మార్కెట్లు పెరుతున్నప్పటికీ , మదుపర్లు అప్రమత్త తో వ్యవహరించటం మంచిది .

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17180
  • అవరోధాలు: 17240-17373-17490
  • మద్దత్తులు:17124-17002-16978-16844