- 24-11-2009
- మార్కెట్ రిపోర్ట్
ఉదయం నుండి ఆటు పొట్ల కి గురి ఐన మార్కెట్లు నేడు స్వల్ప నష్టాలను నమోదు చేస్తూ ముగిసాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 49 పాయింట్లు కోల్పోయి 17131 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది నేటి ఉదయం మేము సూచించిన కీలక మద్దత్తు స్థాయి ఐన 17124 పాయింట్ల కి అత్యంత సమీపం గా వుండటం విశేషం. కాగా నేడు నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 5090.55 పాయింట్ల వద్ద ముగిసింది. ఐతే నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.2 శాతం , స్మాల్ క్యాప్ రంగం 0.4 శాతం లాభపడటం విశేషం.
సేక్టరాల్ ఇండెక్స్ లను పరిశీలిస్తే, నేటి ట్రేడింగ్ లో ఆటో ఇండెక్స్, కన్సుమేర్ ద్యు ర బుల్ ఇండెక్స్ 1.4 % చొప్పున లాభపడటం విశేషం. కాగా FMCG 0.9 %, మెటల్స్ ఇండెక్స్ 0.8 % నష్టాలను చవిచూసాయి. సెన్సెక్స్ స్తోచ్కు లను పరిశీలిస్తే, టాటా స్టీల్ , రిలయన్స్ ఇన్ఫ్రా 2.8 % , 2.3 % మేరకు నష్టపోయాయి. కాగా మారుతి 2.6 % , MNM 2.4 % లాభాలను ఆర్జించాయి.