- 9-11-2009
- మార్కెట్ రిపోర్ట్
వరుసగా నాలుగవ రోజు మార్కెట్లు విజయ పరంపరని కొనసాగించాయి. నేడు సెన్సెక్స్ 340 పాయింట్లు లాభ పడి 16498పాయింట్ల వద్ద ముగిసింది. ఇది మేము ఉదయం సూచించిన 16494 పాయింట్ల స్థాయికి అత్యంత సమీపమని గుర్తించాలి. నేడు నిఫ్టీ 102 పాయింట్లు లాభ పడి 4898 పాయింట్ల వద్ద ముగిసింది. . సెన్సెక్స్ 2.11 శాతం, నిఫ్టీ 2.13 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేసాయి.
నేడు మిడ్ క్యాప్ రంగం 2 శాతం, స్మాల్ క్యాప్ రంగం 2.1 శాతం లాభాలను ఆర్జించాయి. సేక్టరాల్ ఇండెక్స్ ల లో నేడు అన్ని రంగాలు లాభాలతో ముగియటం విశేషం. నేడు బ్యాంకింగ్ రంగం అత్యధికం గా 4.8 శాతం ఎగబాకింది. కాగా కన్సుమేర్ డ్యురబుల్స్ రంగం 2.4శాతం వృద్ధి చెందింది. నేటి సెన్సెక్స్ స్టాకు ల లో SBI, ICICI BANK 5.2 %, 4.7 % చొప్పున లాభపడ్డాయి. కాగా BHARTI AIRTEL , RCOM 3.9 % , 2.2 % చొప్పున క్షీణించాయి.