- ముఖ్య గమనిక
- 9-11-2009
వెబ్సైటు మేంటైనన్స్ జరుగుతున్న దృష్యా , నేడు అప్పుడప్పుడు సలహా పేజి పనిచేయకపోవచ్చు. చదువరుల ఉపయోగార్థం నేడు సలహాలు హోం పేజిలో కూడా ప్రచురిస్తున్నాము .-- EDITOR
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ప్రయత్నం లో భాగం గా వచ్చే సంవత్సరం నుండి ఉద్దీపణలు క్రమేపి ఉపసంహరించ నున్నట్లు ప్రధాని చేసిన ప్రకటన, నేడు మార్కెట్లను ప్రభావితం చేయనున్నది. ఆర్ధిక వ్యవస్థ అతి త్వరలో కోలుకొనున్నదని ప్రధాని ఇచ్చిన భరోసా కంటే కంపనీలు తమకు వచ్చే ప్యాకేజీల పై అధిక దృష్తి పెట్టటం సహజం కనుక మార్కెట్లు నేడు కొంత ఆటుపోట్లకి గురి అయ్యే అవకాశం ఉంది. పైగా దేశం లో అతి పెద్ద ఫండ్ సంస్థ ప్రిన్సిపాల్ , సెన్సెక్స్ రా గల 6 నెల ల లో సుమారు 10 % దిద్దుబాటు కి గురి అవ్వనున్నట్లు ప్రకటించటం , ముఖ్యం గా కంపనీల ఆదాయం ఊహించినంతగా ఉండక పోవచ్చన్న జోస్యం కూడా , ఈ నేపధ్యం లో , ప్రాముఖ్యత చోటు చేసుకోనున్నది. విదేశీ సంస్థాగత మదుపర్లు , గత రెండు వారాల లో , భారతదేశం తో సహా , ఇతర ఎదుగుతున్న మార్కెట్ల నుండి కూడా భారి స్థాయి లో డబ్బు ని ఉపసంహరించటం కూడా గమనార్హం
బుల్ల్స్ నేటి ట్రేడింగ్ లో ప్రధానం గా , PSU సంస్కరణల ను ఆధారం గా చేసుకొని మార్కెట్లను పైకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయవచ్చు.అదే విధం గా , FII ల పెట్టుబడులని మరింతగా సరళీకృతం చేసే విధానం లో భాగంగా , కేంద్ర కాబినెట్ అవసరం లేకుండా కేవలం ఆర్ధిక మంత్రి పరిధిలోనే పెట్టుబడుల మంజూరీ రెండింతలు చేయనున్నట్లు సిఫారిసులు మార్కెట్లను ఉత్సాహ పరచనున్నాయి. పైగా నేడు సానుకూల ఆసియా మార్కెట్ల ప్రభావం కూడా బుల్ల్స్ కి కొంత మద్దత్తు ఇవ్వనున్నది. నిన్న అమెరికా లో సార్వత్రిక మేడి కేర్ విధానం పై హౌస్ లో బిల్లు ఆమోదించటం జరిగింది. ఈ అంశం వలన నేడు అమెరికా స్టాక్ మార్కెట్లు, ముఖ్యం గా హెల్త్ కేర్, ఇన్సురన్సు ,ఫార్మ రంగాలు ప్రతికూలం గా స్పందించనున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం మధ్యాన్నం ఐరోపా మార్కెట్ల పై పడితే, అప్పుడు మన మార్కెట్లు కూడా ఐరోపా మార్కెట్లకి అనుసంధానంగా మధ్యాన్నం తరువాత కొంత ఆటుపోట్లకి గురయ్యే అవకాశం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16158
- అవరోధాలు: 16261-16340-16494
- మద్దత్తులు:16114-16002-15973-15881