- 10-11-2009
- మార్కెట్ నాడి
జి 20 దేశాల సమావేశం లో ఉద్దేపనలు కొనసాగించాలని తీర్మానం చేయటం తో నిన్న అమెరికా మార్కెట్లు అనూహ్యం గా లాభపడ్డాయి. ఈ ప్రభావం నేడు ఆసియా మార్కెట్ల ఫై కూడా ఉండటం తో నేడు మన మార్కెట్లు కూడా ఇదే రీతి లో స్పందించి మరికొంత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయనున్నాయి. అమెరికా మార్కెట్ల లో , ఈ ఉద్దిపనల కొనసాగింపు ప్రకటన ద్వారా కమోడిటి లు కూడా భారి గా బలపడ్డాయి. ఐతే ఇది ద్రవ్యోల్బణ అగ్ని కి మరికొంత ఆజ్యం జోడించినట్లయ్యే అవకాశం ఉన్నందున అమెరికా డాలర్ విలువ మరింత గా క్షీనించ నున్నది. అంతే కాక రేపు భారత ప్రభుత్వం 700 కోట్ల రూపాయల ట్రెజరీ బిల్లు లను వేలం వేయనున్నది. ఈ అంశం కూడా డాలర్ - రూపాయి మారక విలువను మరింత గా ప్రభావితం చేయనున్నది. కాబట్టి ఇది మన ఎగుమతులు, ఐ.టి పరిశ్రమలను కొంత ప్రభావితం చేయవచ్చు.
మార్కెట్లను ప్రభావితం చేసె ఇతర స్థానిక అంశాలను పరిశీలిస్తే ....
చిన్న కంపనీల లిస్టింగ్ విధానం కొంత సరళీకృతం చేయనున్నట్లు SEBI ప్రకటించటం కూడా నేడు మార్కెట్ల కు శుభసూచకం . SEBI నూతన విధానం వలన బ్యాంకులు చిన్ని కంపనీల ఇష్యూ కు మరింత చొరవ తీసుకునే వెసులుబాటు కల్పించనుంది. QIB పధ్ధతి లో ధరల శ్రేణిని తొలిగించి కేవలంవేలం పద్ధతి ని అనుసరించాలని నిర్ణయం ప్రకటించింది
అదే గా ప్రభుత్వం చేపట్ట నున్న ప్రభుత్వ రంగ షేర్ల విక్రయానాలు పరివేక్షిమ్చెందుకు JP MORGAN, BANK OF AMERICA, BARCLAYS మున్నగు దిగ్గజాలు పోతిపదనున్నట్లు వార్త కూడా మార్కెట్ల లో కొంత ఉత్సాహం కల్పించ నున్నదీ నేడు మార్కెట్లు గ్యాప్ అప్ తో శుభారంభం చేయనున్నాయి .
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16498
- అవరోధాలు: 16668-16754-16844
- మద్దత్తులు:16340-16252 -16124-16064