- మార్కెట్ ముందుచూపు
(09-11-2009 నుండి 13-11-2009 వరకు ) :: గత వారం అత్యంత బలహీనం గా ప్రారంభమైన మన మార్కెట్లు , చివరికి మరొక సారి విజయ పరంపర ని పునః ప్రారంభించింది. ప్రభుత్వ రంగ సంస్థల లో పెట్టుబడులను ప్రభుత్వం , ఉపసంహ రించు కో నున్నట్లు చేసిన ప్రకటన మార్కెట్ల లో ఉత్సాహాన్ని నింపింది.. పైగా అమెరికా మార్కెట్ల లో సైతం విడుదల ఐన పలు ఆర్ధిక గణాంకాలు ప్రపంచ మార్కెట్ల ను సానుకూలం గా ప్రభావితం చేయటం కూడా మన మార్కెట్లు తిరిగి లాభాల బాట పట్టేందుకు దోహద పడింది. లాభాల లో ఉన్న ప్రభుత్వ సంస్థల లో కనీసం 10 % పెట్టుబడులను ఉపసంహరించు కునేందుకు సంసిద్ధత వ్యక్త పరచటం, లిస్టింగ్ కాని సంస్థ ల లో గత 3 సంవత్సరాలు గా లాభాలను ఆర్జించి వుంటే, అటువంటి సంస్థలను సైతం లిస్టింగ్ చేసేందుకు పచ్చ జండా ఊపనున్నట్లు ఆర్ధిక మంత్రి ప్రకటించటం వలన మార్కెట్లు బలపడ్డాయి. పబ్లిక్ ఇష్యూ వలన సమకూరిన ధనం వచ్చే మూడు సంవత్సరాల లో వివిధ ప్రజా ప్రోయోజనాలని ప్రోత్సహించే విధం గా ఖర్చు చేయగలమని ఇచ్చిన భరోసా , ప్రవాస భారతీయుల పై క్యాపిటల్ గైన్స్ పన్ను విధానం , ఇతర దేశాల తో పన్ను రద్దు ఒప్పందాలు మున్నగు అంశాల పై కూడా సానుకూలం గా స్పందించటం తో మార్కెట్లు బలపడ్డాయి.
ఈ వారం పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల పై మార్కెట్లు దృష్తి పెట్టనున్నాయి. ఈ గురువారం విడుదల అయ్యే గణాంకాలు మార్కెట్ల ని ప్రభావితం చేయనున్నాయి. కాగా , అదే రోజు ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా విడుదల కానున్నాయి. ఇక పై ఈ గణాంకాలు నెలసరి ప్రకటించ బోవటం గమనార్హం .
గత వారం లాభ పడ్డ PSU స్టాకు లు , ఈ వారం కూడా మదుపర్ల దృష్టిని ఆకర్షించ నున్నాయి. ప్రపంచ మార్కెట్లు సానుకూలం గా ఉంటే, ఇతర రంగాల స్టాకు లు కూడా లాభాల లో పయనించే అవకాశం ఉంది. Q 2 ఫలితాలు ముగిసినందున మన మార్కెట్లు ప్రపంచ మార్కెట్ల కి అనుసంధానం గా పయనించవచ్చు. కాబట్టి ప్రతికూల ప్రపంచ వాతావరణం మన మార్కెట్లను మరల దెబ్బతీయవచ్చు. ప్రపంచ మార్కెట్లు సానుకూలం గా వుంటే , టెలికాం స్టాకు ల లో మరల కొనుగోళ్ళు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యం గా రియాలిటి, మెటల్స్ రంగం స్టాకులు FII కొనుగోళ్ళ పై ఆధారపడనున్నాయి
టెక్నికల్ గా పరిశీలిస్తే, ఈ వారం సెన్సెక్స్ నకు 16262,16494,16683 పాయింట్ల వద్ద కీలక అవరోధాలు సెన్సెక్స్ ప్రస్తుతం 60 DMA ఐన 16158 వద్ద ట్రేడ్ అవుతున్నది. కాగా 100 DMA ఐన 15358 పాయింట్లు సెన్సెక్స్ నకు కీలక మద్దత్తు. 16002 ,15538 పాయింట్ల వద్ద కూడా చొప్పుకోదగ్గ మద్దత్తు ఉంది.