• 4-11-2009 :: 8 AM
  • మార్కెట్ నాడి
వరుస నష్టాల తరువాత, నేడు జపాన్ మినహా , ఇతర ఆసియా మార్కెట్లు లాభాల లో పయనిస్తున్నాయి. గత రాత్రి అమెరికా మార్కెట్ల లో FORD, GENERAL MOTORS అక్టోబర్ మాసపు అమ్మకాల గణాంకాలు కొంత ఊరట కలిగించే విధం గా ఉండటం తో అక్కడి మార్కెట్లు నష్టాల నుండి లాభాల లో కి పయనించాయి.
దీపావళి అనంతరం అతి దారుణం గా నష్టపోతున్న మన మార్కెట్ల లో సానుకూల ప్రపంచ వాతావరం నేపథ్యం లో కొంత పుల్ బ్యాక్ ర్యాలీ కనపడే అవకాశం ఉంది. ఆర్ధిక మంత్రి ఉద్దీపన ప్యాకేజీలను ఇప్పట్లో ఆపేది లేదని స్పష్టం చేయటం కూడా నేడు బుల్ల్స్ కి కొంత ఊరట కలిగించే అంశం.
ఐతే , విదేశీ సంష్టాగత మదుపర్ల అమ్మకాల జోరు కొనసాగితే మార్కెట్లు పతనం కొనసాగించే అవకాశం కూడా ఉంది. ముఖ్యం గా అమెరికా డాలర్ విలువ క్షీణించే అవకాశం ఉందని రిజర్వు బ్యాంక్ అనుమాల నేపధ్యం లో కమోడిటీ పట్ల ఇన్వెస్టర్లు / విదేశీ సంస్థాగత మదుపర్లు మొగ్గు చూపే అవకాశం ఉన్నందున ఈక్విటీ ల నుండి కామో డిటి ల వైపు పెట్టుబడులు మరలె అవకాశం ఉంది.
టెక్నికల్ గా గత ట్రేడింగ్ లో మార్కెట్లు అతి కీలక 100 DMA స్థాయిలను కోల్పోవటం తో సెన్సెక్స్ మరింత క్షీణించి తదుపరి ముఖ్య మద్దత్తు ఐన 15379 వరకు క్షీణించే అవకాశం ఉంది. ఈ స్థాయి నుండి ప్రపంచ మార్కెట్లు సానుకూలం గా ఉంటే కొంత పుంజుకునే ప్రయత్నం చేయవచ్చు. బలింజేర్ బ్యాండ్ ల కనిష్ట రేఖ ని చేదించి నందున, 15379 లేదా 14645 పాయింట్ల వద్ద పుల్ బ్యాక్ ర్యాలి వచ్చే అవకాశం ఉంది. పుల్ బ్యాక్ ర్యాలీ ల ను అమ్మకాలకి వినియోగించుకోవటం మంచిది.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15404
  • అవరోధాలు:15446- 15568-15695-15769
  • మద్దత్తులు ::15379-15169-15080-14888