- 4-11-2009 :: 6 : 45 PM
- మార్కెట్ రిపోర్ట్
గత ఆరు రోజులు గా మార్కెట్ల పై పట్టు బిగించిన ఎలుగు ల పై నేడు బుల్ల్స్ ఒక్క సారిగా విరుచుకుపడ్డాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ అమాంతం 507 పాయింట్లు 15912 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 147 పాయింట్లు ఎగబాకి 4710పాయింట్ల వద్ద ముగిసింది. ఆద్యంతం నేడు మార్కెట్లు లాభాల లో పయనించి ఉదయం మా అంచనాలని నిజం చేసాయి. సానుకూల ప్రపంచ మార్కెట్లు, ఆర్ధిక మంత్రి ఉద్దేపనలు కొనసాగుతాయని ఇచ్చిన భరోసా... గత వారం రోజులు గా నష్టాలను చవిచూసిన మార్కెట్లకు బలం చేకూర్చాయి. ఫెర్టిలైజేర్స్ పై దశల వారిగా సబ్సీడిని సూచన ప్రాయం గా మంత్రి తెలియజేయటం కూడా మార్కెట్ల లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది ఇలా ఉండగా ,అంబాని సోదరుల మధ్య జరుగుతున్నా వివాదం లో నేడు కొత్త మలుపు తిరగటం కూడా రిలయన్స్ షేర్లు లాభ పడేందుకు దోహద పడి, తద్వారా సెన్సెక్స్ మరింత పుంజుకునేందుకు కారణమయ్యింది. ఈ కేసు ని విచారిస్తున్న న్యాధికారి విచారణ నుండి వైదోలగటం ఈ కేసు లో ఊహించని పరిణామం . నేటి ట్రేడింగ్ లో అన్ని రంగాలు లాభాలను ఆర్జించటం విశేషం. మిడ్ క్యాప్ రంగం 3.6 శాతం వృద్ధి పొందగా , స్మాల్ క్యాప్ రంగం 2.5 శాతం లాభపడింది. సేక్తోరాల్ ఇండెక్స్ ల లో కూడా నేడు అన్ని రంగాలు ఎగబాకాయి. నిన్న ఘోరం గా నష్టపోయిన రియాలిటీ ఇండెక్స్ నేడు 9 .65 % ఎగబాకింది. కాగా మెటల్స్ రంగం 5.36 % వృద్ధిని నమోదు చేసింది. సెన్సెక్స్ స్టాకు ల లో నేడు JP అసోసియేట్స్, hindalco 9. 5 %, 9.4 % చొప్పున లాభాలను ఆర్జించాయి. కాగా సన్ ఫార్మ, గ్రాసిం ౦.8 % , 0. 4 % చొప్పున నష్టపోయాయి