- 3-11-2009 : 6 PM
- మార్కెట్ రిపోర్ట్
వరుసగా ఆరవ రోజు , నేడు మన మార్కెట్లు నష్టాలను చవిచూసాయి. దీనితో సెన్సెక్స్ 491 పాయింట్లు క్షీణించి 15405 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ పాయింట్లు 148 నష్టపోయి 4563 పాయింట్ల వద్ద నిలిచింది.
ఆరంభ ట్రేడ్ లో మా అంచనాలకు అనుగుణం గా నష్టాలో లో ప్రారంభమైన మార్కెట్లు ఒక దశ లో నిలదొక్కు కొనే ప్రయత్నం చేసి గరిష్టం గా, సెన్సెక్స్15957 పాయింట్ల వరకు చేరుకుంది. ఐతే అమ్మకాలు భారి గా కొనసాగటం తో మార్కెట్లు తిరిగి నష్టపోయాయి. మధ్యాన్నం తాజా ట్రేడింగ్ లో ఐరోపా మార్కెట్లు కూడా బలహీనం గా ప్రారంభ మవ్వటం , అక్కడి UBS , RBS మున్నగు బ్యాంకుల ఫలితాలు ప్రతికూలం గా ఉండటం తో , మన మార్కెట్ల లో కూడా, ఐరోపా మార్కెట్ల కి అనుసంధానం గా అమ్మకాలు మరింత గా కొనసాగి భారి గా దిద్దుబాటు కి గురి అయ్యాయి. దీనితో ఒక దశ లో సెన్సెక్స్ కనిష్టం గా 15331 పాయింట్లవరకు పతనమయ్యింది. చివరికి సెన్సెక్స్ 15405 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో అన్ని సేక్టరాల్ ఇండెక్స్ లు ఎరుపు రంగు ను నమోదు చేసాయి. రియాలిటీ రంగం ఘోరం గా 9.76 % నష్టపోగా, మెటల్స్ 5.95 % క్షీణించింది.
నేడు మిడ్ క్యాప్ రంగం 3.74%, స్మాల్ క్యాప్ రంగం 4.5% నష్టాలను నమోదు చేసాయి.
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే, నేడు BHARTI AIRTEL 2.7 %, MARTUI 1.1 % వృద్ధి చెంది బుల్ల్స్ పరువు ని నిలబెట్టే ప్రయత్నం చేసాయి. కాగా HINDALCO , DLF 10.5 % , 9 % చొప్పున అతి ఘోరం గా పతనమయ్యాయి.