• 05-11-2009 :: 8 :15 am
  • మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా ఫెడరల్ రిజర్వు కీలక వడ్డీ రేట్లను తగ్గించి వుంచనున్నట్లు ప్రకటించటం వలన తొలుత అమెరికా మార్కెట్లు లాభాల లో పయనించాయి. కాని క్రెడిట్ కార్డుల పై వడ్డీ రేట్లను యదేచ్చగా అమలుపరిచే విధానాన్ని స్వస్తి చెపుతూ హౌస్ తీసుకున్న నిర్ణయం తో మార్కెట్లు లాభాలకి తిలోదకాలు ఇచ్చాయి . ఈ ప్రభావం వలన ఆసియా మార్కెట్లు కూడా నష్టాల తో నేటి ఉదయం ప్రారంభమయ్యాయి. పైగా కొరియా ఆర్ధిక మాంద్యం ఇంకా కొనసాగుతుందని అనుమానం వ్యక్తం చేయటం, న్యూ జి ల్యాండ్ లో గత తొమ్మిది సంవత్సరాల లో గరిష్ట స్థాయి లో నిరుద్యోగ గణాంకాలు విడుదల కావటం తో ప్రపంచ మార్కెట్లు బలహీనపడ్డాయి.
మన మార్కెట్లను పరిశీలిస్తే, నిన్నటి పుల్ బ్యాక్ ర్యాలీ తరువాత నేడు మన మార్కెట్లు మరొక సారి భల్లుకాల గుప్పెట్లో వుండనున్నాయి. ప్రపంచ మార్కెట్లు కూడా ఇందుకు సహకరిస్తున్నందున నేడు మరొక సారి మన మార్కెట్లు నష్టాల బాట పట్టే అవకాశం ఉంది.
ప్రణాళిక సంఘ అధ్యక్షులు మోంటెక్ సింగ్ ఆహువాలియా , ప్రభుత్వ రంగ సంస్థల లో ప్రభుత్వ వాటాలు అతి త్వరలో విక్రయం జరుగుతాయని ప్రకటించటం , బుల్ల్స్ కి కొంత ఊపిరి మార్కెట్ నింపే అంశమైనా, ప్రధానం గా నేడు మార్కెట్లు నిన్నటి లాభాలను విసర్జించే దిశ గా పయనం సాగించవచ్చు.
  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15912
  • అవరోధాలు: 15973-16040- 16114-16283
  • మద్దత్తులు:15881-15685-15466