30-11-2009
మార్కెట్ నాడి
దుబాయి వరల్డ్ అప్పు ఎగవేత నేపధ్యం లో అలుముకొన్న సంక్షో భానికి కొంత ఊరట కలిగిస్తూ అక్కడి సెంట్రల్ బ్యాంక్ , ఆ దేశం లో వాణిజ్యం నిర్వహిస్తున్న బ్యాంకులకు భరోసా ఇస్తూ , కొంత వెలుసుబాటు ప్రకటించటం తో ప్రప్రంచ మార్కెట్లు కొంత ఊపిరి తీసుకున్నాయి. దీనితో గత రెండు రోజులు గా భారి నష్టాలను చవి చూసిన ప్రపంచ మార్కెట్లు నేడు ఆ నష్టాలను పూరించుకునే దశ లో తిరిగి లాభాల లో నడుస్తున్నాయి. పైగా, గత శుక్రవారం బ్లాక్ ఫ్రైడే సందర్భం గా అమెరికా లో రిటైల్ అమ్మకాలు భారిగా జరగటం కూడా పెరుగుతున్న కన్సుమేర్ విశ్వాసం గా గుర్తిస్తూ మార్కెట్లు లాభాల లో పయనిస్తున్నాయి.
మన మార్కెట్ల పరం గా విశ్లేషిస్తే, మన మార్కెట్లు కూడా ప్రపంచ మార్కెట్ల ధోరణి ని అవలంభిస్తూ నేడు కొంత పుల్ బ్యాక్ రాలి కి తావిచ్చే అవకాశం ఉంది. గత రెండు రోజులు గ భారి గా నష్టపోయిన స్టాకులు నేడు కొంత పెరిగే అవకాశం ఉంది కనుక ట్రేడర్లు డే ట్రేడింగ్ కొరకు ఇటువంటి స్టాకుల పై దృష్టి సారించే అవకాశం ఉంది. ఐతే నేడు సెప్టెంబర్ 30 కి ముగిసిన త్రైమాసిక GDP గణాంకాలు విడుదల కానున్నాయి. అంచనాల ప్రకారం ఇది సుమారు 6.3 % గా ఉండగలదు. ఇంత కంటే తక్కువ గా నమోదైతే , మార్కెట్ల లో మరొక సారి భల్లూకాలు ( bears) విరుచుకుపడే ప్రమాదం ఉంది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16632
- అవరోధాలు: 16686-16844-16978-17004
- మద్దత్తులు:-16454 -16196-16002