మార్కెట్ ముందుచూపు

(30-11-2009 నుండి 04-12-2009 )

గత వారం దుబాయ్ దుమారం వలన బెంబే లెత్తిన ప్రపంచ మార్కెట్లు వారం అమెరికా మార్కెట్ల ప్రతిక్రియ కి అనుగుణం గా ప్రారంభం కానున్నాయి. దుబాయి ఉదంతం వలన ప్రపంచ మార్కెట్ల లో ఇప్పటివరకు కనిపించిన పుంజు కోలు కేవలం పై మెరుగులే అని, ఆర్తిక మాంద్యం నుండి కోలు కునేందుకు మరింత సమయం పట్ట వచ్చన్న ఆలోచనా విధానానికి కొంత చేయూతనిచ్చింది.

గత శుక్రవారం భారి గా కోల్పోయిన మన మార్కెట్లు ఇన్సురన్సు కంపనీల కొనుగోళ్ళ నేపధ్యం లో , కొంత నిలదొక్కుకునే ప్రయత్నం చేసినప్పటికీ, మన కంపనీలు ఏ మేరకు దుబాయి సంక్షోభం వలన నష్టపోనున్నాయి, ఏ కంపనీల భాగస్వామ్యం దుబాయి వరల్డ్ తో ఎంతెంత ఉన్నది అని వారం మనకు తెలియనున్నది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు, ముఖ్యం గా బ్యాంక్ ఆఫ్ బరోడా కొంత దెబ్బ తినే ఆస్కారం వుందని ప్రకటించటం గమనార్హం. ఇదే రీతి లో నాగార్జున కంస్ట్రెక్షన్ కి కూడా దుబాయి వరల్డ్ తో లావాదేవీలు ఉన్నాయన్న వార్తలు వినవస్తున్నాయి .

ముఖ్యం గా మన దేశ ఎగుమతులు చాల మేరకు దుబాయి / గల్ఫ్ ప్రాంతం కి చెందటం, ఎగుమతులు కేవలం జౌళి , సాఫ్ట్ వేర్ ఉత్పత్తులకే కాక , బాలివుడ్ కి చెందిన పలు సంస్థలు కూడా తమ ఆదాయం లో అధిక భాగం దుబాయి ప్రాంతం నుండి వసూలు కావటం మున్నగు అంశాలు పరిశీలిస్తే, వారం PSTL , BABA ARTS మున్నగు కంపనీల వాటాలు అమ్మకాల వత్తిడికి గురి అయ్యే సూచనలు వున్నాయి. ఐతే వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ , మన దేశానికి వచ్చే ముప్పేమీ లేదని భరోసా ఇవ్వటం కొంత ఊరట కలిగించే విషయం. అంశం పై రిజర్వు బ్యాంక్ స్పందిస్తూ ఇది కేవలం వ్యాపార సమస్యే కాదని, ప్రవాసా భారతీయులు ,వర్క్ పర్మిట్ ల తో ఆ దేశాల లో పనిచేసే భారతీయుల సంఖ్యఎక్కువగా ఉందని. వారు మన దేశానికి పంపుతున్న డబ్బు పై దుబాయి వరల్డ్ ప్రభావం ఏ మేరకు వుండనున్నదో అధ్యయనం లో తెలియ నున్నదని ప్రకటించటం కీలకం

ఐతే రేపు మన దేశపు GDP గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ గణాంకాలు మన మార్కెట్లను ఈవారం ప్రభావితం చేయనున్నాయి. అదే విధం గ సిమెంట్ , ఆటో మొబైల్ రంగానికి చెందిన ఎగుమతుల గణాంకాలు కూడా విడుదల కానున్నాయి .

అంతర్జాతీయం గా ఈ వారం , అమెరికా లో డిసెంబర్ 1 న విడుదల కానున్న ISM ఉత్పత్తి గణాంకాలు, డిసెంబర్ 3 న అమెరికా ఫెడ్ అద్యక్షులు బెన్ బెర్నంకే ఆ పదవికి పున : నియామకం పై వార్త , డిసెంబర్ 4 న నిరుద్యోగ గణాంకాలు కేవలం అమెరికా మార్కెట్ల నే కాక ప్రపంచ మార్కేట్లని సైతం ప్రభావితం చేయనున్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఇప్పటివరకు భారిగా లాభపడ్డ మన మార్కెట్ల లో దిద్దుబాటు చోటు చేసుకునేందుకు దుబాయి పరిణామం ఒక మిష గా పేర్కొనవచ్చు.

టెక్నికల్ గా పరిశీలిస్తే ,గత వారం మార్కెట్లు సుమారు 60 రోజుల చలన సగటు వద్ద ముగిసాయి. ఈ వారానికి గాను సెన్సెక్స్ నకు నూరు రోజుల చలన సగటు ఐన 16002 పాయింట్లస్థాయి వద్ద కీలక మద్దత్తు ఉందని చెప్పుకోవచ్చు. ఇది వీగిపోతే సెన్సెక్స్ నకు 15490 కీలక స్థాయి. ఈ వారం 16756-16844-17002-17240-సెన్సెక్స్ నకు కీలక అవరోధాలు కాగా పైన చెప్పుకున్న స్థాయిలు సెన్సెక్స్ నకు . 16454-16196-15992-15790 చోపుకోదగ్గ ఇతర మద్దత్తు స్థాయిలు.