- 27-11-2009
- మార్కెట్ రిపోర్ట్
నేటి ఉదయం చర్చించిన విధం గా దుబాయ్ సమస్య కారణం గా నేడు ప్రపంచ మార్కెట్ల తో సహా మన మార్కెట్లు కూడా కుదేలుమన్నాయి. ప్రథమార్థం లో మార్కెట్లు భారి గా క్షీణించి మేము సూచించిన 75 రోజుల చలన సగటు వరకు , అంటే 16210 పాయింట్ల వరకు క్షీణించింది. కాగా , మధ్యాన్నం తదుపరి షార్ట్ కవేరింగ్ సహాయం తో మార్కెట్లు వేగం గా కోలుకున్నప్పటికీ, 222 పాయింట్ల నష్టాన్ని నమోదు చేస్తూ 16632పాయింట్ల వద్ద సెన్సెక్స్ ముగిసింది. నేడు నిఫ్టీ కూడా 64 పాయింట్లు క్షీణించి 4942పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్1.35 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.14శాతం నష్టాలను నమోదు చేసింది. నేటి ట్రేడింగ్ లో హెల్త్ కేర్ ఇండెక్స్ మినహా అన్ని రంగాలు కుదేలుమన్నాయి. ఈ రంగం స్వల్పంగా 0.08 % లాభపడగా , ఐ.టి ఇండెక్స్ 2.2 %, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.8 % నష్టపోయాయి.
సెన్సెక్స్ స్టాకు ల లో JP ASSOCIATES 3.1 %, LNT 2.7% నష్టాలను నమోదు చేయగా, BHARTI AIRTEL 0.9 %, HEROHONDA 0.5 % చొప్పున స్వల్పం గా లాభాలను నమోదు చేసాయి.