• 20-11-2009
  • మార్కెట్ నాడి

అమెరికా మార్కెట్లు గత రాత్రి , బలహీన మైన ప్రపంచ మార్కెట్ల కి అనుగుణం గా నష్టాలను చవిచూసింది. గత కొన్ని మాసాలు గా కొనసాగుతున్న ర్యాలి అతిశయించిందని మూడు నెలల ట్రెజరీ బిల్లులు మొదటి సారిగా ప్రతివృద్ధిని నమోదు చేయటం తో అక్కడి మార్కెట్లు కుదేలుమన్నాయి. నేటి ఉదయం ఆసియా మార్కెట్లు సైతం తీవ్ర నష్టాల తో ప్రారంభ మయ్యాయి. జపాన్ చిప్ మార్కెట్లు MORGAN STANLEY అంచనాలతో కుదేలు మన్నాయి. కమోడిటి లు కూడా క్షీణించటం తో ఆసియా మార్కెట్ల లో అమ్మకాల జోరు కొనసాగుతోంది. కాగా చైనా మార్కెట్ల లో అతి త్వరలో అసెట్ బుడగ చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని సర్వత్రా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సింగపూర్ ద్రవ్యోల్బణ అంచనాలు కూడా 2. 5 % నుండి 3 . 5 % పెరగనున్నదని అంచనాలు వెలవడ్డాయి. ఈ కారణాల వలన నేడు ప్రపంచ మార్కెట్ల తీరు తెన్నులు అత్యంత బలహీనం గా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ ప్రభావం వలన మన మార్కెట్లు కూడా నిన్నటి నష్టాలను కొనసాగించే అవకాశాలు లేక పోలేదు.

మన మార్కెట్ల పరంగా విశ్లేషిస్తే , భారత దేశం లో ద్రవ్యోల్బణం కట్టుదిట్టం చేయాలంటే అతి త్వరలో వడ్డీ రెట్లు పెంచక తప్పదని OECD పేర్కొనటం ప్రాముఖ్యత చోటుచేసుకోనుంది . కాగా RIL -RNRL వివాదం లో సుప్రీం కోర్ట్ , పెట్రోలియం మంత్రిత్వ శాఖ ని , కేసు లో పార్టీ గా గుర్తించటం తో RNRL కి ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. నిన్న చెరుకు మద్దత్తు ధర పై పునరాలోచన చేస్తామని ప్రధాని హామీ ఇవ్వటం, ఆస్ట్రేలియా కి చెందిన ప్రముఖ చెక్కర ఎగుమతి దారులు , ఈ సంవత్సరం కూడా చెక్కర ధరలు ఎగబాకనున్నట్లు చెప్పిన జోస్యం పై ,నేడు కూడా షుగర్ స్టాకులు వత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రపంచ మార్కెట్ల బలహీనత, వారంతం కనుక నేటి ట్రేడింగ్ లో ట్రే డెర్లు తమ పోజిషన్లు తగ్గించుకునే అవకాశం ఉన్నందున , నేడు మన మార్కెట్లు బలహీనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16786
  • అవరోధాలు:16844-16978-17014
  • మద్దత్తులు:16754-16680-16494 -16340