• 19-11-2009
  • మార్కెట్ రిపోర్ట్

బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నేపధ్యం లో నేడు మన మార్కెట్లు నష్టాలను చవిచూసాయి.దీనితో సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 16786 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టి 65.70 పాయింట్లు నష్టపోయి 4989 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి ఐదు వేల మార్కు కంటే దిగువ ముగియటం నేటి ట్రేడింగ్ విశేషం.

నేటి ట్రేడింగ్ లో ప్రపంచ మార్కెట్ల కారణం గా ఆద్యంతం బలహీనం గా నడిచిన మన మార్కెట్లకి పార్లమెంట్ లో జరిగిన రభస మరింత బలహీనపడెందుకు కారణమయ్యింది. నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజున చెరుకు రైతుల కి మదత్తు ధరపై జరిగిన తీవ్ర రభస కారణం గా నేడు సమావేశానికి పూర్తి గా అంతరాయం కలిగింది. దీనితో షుగర్ స్టాకు లు తీవ్రం గా నష్టపోయాయి . ఈ కారణం గా యితర స్టాకు లు గూడా బలహీనతకు గురయ్యాయి.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.67 శాతం క్షీణించింది. కాగా స్మాల్ క్యాప్ రంగం కూడా 1.08 శాతం నష్టపోయింది.

సేక్టరాల్ ఇండెక్స్ ల లో నేడు అన్ని రంగాలు అరుణవర్ణం ధరించాయి. రియాలిటీ రంగం 4. 4 % కుదేలుమనగా, బ్యాంకింగ్ రంగం 2% నష్టపోయింది. సెన్సెక్స్ స్టాకులను పరిశీలిస్తే , JP ASSOCIATES 4.5 %, RELIANCE INFRA 3.9 % నష్టపోయింది. కాగా ACC , HDFC 0.4 % చొప్పున స్వల్పంగా లాభాలను ఆర్జించాయి. .