• 19-11-2009
  • మార్కెట్ నాడి

గత రాత్రి అమెరికా మార్కెట్ల లో నూతన గృహ నిర్మాణ ప్రారంభ గణాంకాలు క్షీణించటం తో అక్కడి మార్కెట్లు ఆద్యంతం నష్టాల లో పయనించాయి.గృహ నిర్మాణాల మీద పన్ను మినహాయింపు లను అక్కడి ప్రభుత్వం తొలగించ వచ్చన్న అంచనాల తోనూ, దీనివలన అమెరికా మార్కెట్లు ఇంకా ప్రభుత్వం ఇచ్చేఉద్దిపణలు కొనసాగితేనే , ఆర్ధిక వ్యవస్థ కోలుకుంటుందని అభిప్రాయాలు వెలువడ్డాయి.

నేడు ఆసియా మార్కెట్లను గమనిస్తే, హాంగ్ కాంగ్ ఎక్స్ చేంజ్ చైర్మన్ అర్కల్లి , ఆసియా లో అసెట్ బుడుగ చోటు చేసుకునే అవకాశం ఉందని , ఆర్థికం గా నిలదొక్కు కునేందుకు కనీసం మరో ఆరు నెలల సమయం పడుతుందని తెలియచేయటం నేడు మార్కెట్లను అతలాకుతలం చేయనున్నది. జపాన్ మార్కెట్లు సైతం ,అక్కడి కంపనీలు తమ వాటాలను అమ్మజూపుతున్నాయని , తీవ్ర నష్టాల తో పయనిస్తోంది.

మన మార్కేట్లని ప్రభావితం చేసే ఇతర అంశాలను పరిశీలిస్తే, ముఖ్యం గా UTI ASSET MANAGEMENT చైర్మన్ సిన్హా , మన మార్కెట్లు ప్రస్తుతం విదేశీ పెట్టుపడుల వలన మాత్రమె ఎగబాకుతున్నాయని , మార్కెట్లు తారా స్థాయి కి చేరినందున, మదుపర్లు అప్రమత్తత తో వ్యవహరించాలని ఇచ్చిన సూచన కీలకం. ఇకపోతే, MORGAN STANLEY జనవరి నుండి RBI వడ్డీ రేటు ని పెంచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ కారణాల వలన నేడు మార్కెట్ల లో కొంత అనిశ్చిత చోటు చేసుకునే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16999
  • అవరోధాలు: 17014-17124-17373
  • మద్దత్తులు:16978-16844-16680-16494