- 18-11-2009
- మార్కెట్ రిపోర్ట్
మార్కెట్లు నేడు ఒడిదుడుకులకు లోనయ్యి చివరికి స్వల్ప నష్టాల తో ముగిసాయి. సెన్సెక్స్ నేడు 52 పాయింట్లు కోల్పోయి 16999 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 7.5 పాయింట్లు నష్టపోయి 5054.7పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ సాధారణ సమావేశాల లో ప్రత్యేకించి ఎటువంటి కొత్త ప్రకటనలు లేకపోవటం తో మార్కెట్లు నిరుత్సాహం చెందాయి. దీనితో మార్కెట్ల లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకోవటం వలన మార్కెట్లు చివరికి నష్టాల తో ముగిసాయి.
ఐతే నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.3 % , స్మాల్ క్యాప్ రంగం 0.8 శాతం లాభపడటం విశేషం . సేక్టరాల్ ఇండెక్స్ లను పరిశీలిస్తే, నేడు మెటల్స్ ఇండెక్స్ 1.2 % వృద్ధిని నమోదు చేసింది. కాగా FMCG 0.7 % లాభపడింది. చమురు మరియు గ్యాస్ ఇండెక్స్ , బ్యాంకింగ్ ఇండెక్స్ 0.8 % చొప్పున నష్టాలను నమోదు చేసాయి. సెన్సెక్స్ వాటాలను లను పరిశీలిస్తే, రిలయన్స్ ఇన్ఫ్రా 3.2 %, LNT 1.7 % క్షీణించి అత్యదికం గా నష్టపోయిన వాటాలు గా నిలిచాయి. కాగా టాటా మోటర్స్, టాటా స్టీల్ 3.1 %, 1.7 % మేరకు లాభాలను ఆర్జించాయి.