• 18-11-2009
  • మార్కెట్ నాడి

మెటల్స్ మరియు కమోడిటిలు లాభపడటం తో నిన్న అమెరికా మార్కెట్లు లాభపడ్డాయి. దీనితో క్షీనిస్తున్న డాలర్ విలువ కూడా కొంత పుంజుకోవటం తో అక్కడి మార్కెట్లు వరుసగా మూడవ రోజు లాభ పడ్డ ట్లయ్యింది. ఆసియా మార్కెట్ల లో సైతం ఇదే ఊపు కనపడుతొంది. నేడు ఆసియా మార్కెట్లు శుభారంభం చేసినా, జపాన్ మార్కెట్ల లో మాత్రం , కంపనీలు తమ ఈక్విటీ లను అమ్మజూడాలని వార్త వెలువడింది. ఇదే జరిగితే , ఆ కంపనీల EPS తగ్గుతుందని అంచనాల తో తిరిగి జపాన్ మార్కెట్లు నష్టాలో పయనిస్తోంది. దీనితో నేటి ట్రేడింగ్ లో మునుముందు ఇతర ఆసియా మార్కెట్ల దూకుడుతనానికి కొంత కళ్ళెం పడవచ్చు . మన మార్కెట్ల పరంగా ఆలోచిస్తే , నేడు మన మార్కెట్లు ప్రధానం గా నేడు చోటుచేసుకోనున్న రిలయన్స్ AGM (సాధారణ సమావేశాల ) పై దృష్టి సారించ నున్నది . సెన్సెక్స్ సుమో వీరుడైన రిలయన్స్ కంపని ,నేటి మీటింగ్ లో తీసుకోబోయే నిర్ణయాలు , చేయబోయే ప్రకటనలు మన మార్కేట్లని ప్రభావితం చేయనున్నది. నేడు మార్కెట్లు ఆసియా మార్కెట్ల ప్రభావం వలన లాభాల తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తదుపరి రిలయన్స్ చేసే ప్రకటనలు మార్కెట్ల తదుపరి గమనాన్ని నిర్దేశించవచ్చు.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17051
  • అవరోధాలు: 17124-17373 -17457
  • మద్దత్తులు:17014-16978-16844