• 17-11-2009
  • మార్కెట్ రిపోర్ట్

బలహీనమైన ఆసియా మార్కెట్ల నేపధ్యం లో మన మార్కెట్లు నేడు అటుపోట్లకి గురయ్యాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్ష్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 18 పాయింట్ల స్వల్ప లాభాన్ని నమోదు చేసి 17051 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 4 పాయింట్లు లాభ పడి 5062 పాయింట్ల వద్ద ముగిసింది.

నేటి ట్రేడింగ్ లో మార్కెట్లు పేలవమైన ప్రదర్శన ని కనపరిచి, ఉదయం మేము సూచించిన అంచనాలకి అనుగుణం గా ట్రేడ్ అయ్యాయి. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.08 % స్వల్ప నష్టాన్ని నమోదు చేయగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.22 % మేరకు లాభపడింది. సేక్టరాల్ ఇండెక్స్ లను పరిశీలిస్తే, నేడు ఐ . టి ఇండెక్స్ అత్యధికం గా 2.02 % లాభాలను ఆర్జించగా, టెక్ ఇండెక్స్ అందులో సగం , అంటే 1.01 % లాభపడింది. నేటి ట్రేడింగ్ లో రియాలిటీ రంగం 1.19 %, చమురు మరియు గ్యాస్ రంగం ౦.71 % మేరకు క్షీణించాయి.

సెన్సెక్స్ స్టాకులను పరిశీలిస్తే, నేడు TCS, హీరో హోండా అత్యధికం గా 4.3%, 3.4% చొప్పున వృద్ధిని నమోదు చేసింది .కాగా ONGC, ACC 2.30%, 2% చొప్పున క్షీణించాయి.