- 17-11-2009
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్ల లో విడుదల అయిన చిల్లర వ్యాపార (RETAIL) గణాంకాలు అంచనాలని మించి వుండటం తో అక్కడి మార్కెట్లు భారి గా లాభాలను నమోదు చేసాయి. .ఐతే జపాన్ లో సేవా రంగం లో డిమాండ్ క్షీణత నమోదు కావటం వలన ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పధకాల ప్రభావం క్షీనిస్తున్నదన్న అంచనాల తో అక్కడి మార్కెట్లు నేడు నష్టాల బాట లో నడుస్తున్నాయి . ఇతర ఆసియా మార్కెట్లు కూడా స్వల్ప ఆటు పొట్ల కి గురిఅవుతున్నాయి. ఈ ప్రభావం వలన మన మార్కెట్లు సైతం కొంత ఒడి దుడుకులకు లోనుకావచ్చు.
కాగా మన దేశ జి. డి.పి వృద్ధి రేటు 6.2 % గా విడుదల కావటం ,మార్కెట్ల సెంటిమెంట్ ని కొంత బలపరచే అవకాశం ఉంది. . ఇది తొలుత అంచనాలను 6 % మించి వృద్ధిని సాధించటం మార్కెట్లకు శుభ సూచకం. ఇతర అంశాలను పరిశీలిస్తే, నిన్న జరిగిన 3 జి వేలం పాట ముందస్తు సమావేశాల లో అతి తక్కువగా హాజరులు నమోదుకావటం తో ఇప్పటివరకు గొప్ప అంచనాలు కలిగి వున్న 3 జి వేలం లో బహుశా ఊహించినంతగా పస వుండక పోవచ్చన్న అనుమాలు వ్యక్తమౌతున్నాయి. ఈ అంశం టెలికాం రంగానికి ప్రతికూలం. నేడు కూడా మన మార్కెట్లు ప్రపంచ మార్కెట్ల కి అనుసంధానంగా పయనించ నున్నాయి .
- . నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 17032
- అవరోధాలు: 17124-17373 -17457
- మద్దత్తులు:17014-16978-16844