11-11-2009

ముఖ్య గమనిక

వెబ్సైటు మేంటైనన్స్ జరుగుతున్న దృష్యా , నేడు అప్పుడప్పుడు సలహా పేజి పనిచేయకపోవచ్చు. చదువరుల ఉపయోగార్థం నేడు సలహాలు హోం పేజిలో కూడా ప్రచురిస్తున్నాము .-- EDITOR

  • మార్కెట్ నాడి

ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖర్జీ నిన్న చేసిన ప్రకటన తో సంకోచం లో పడిన మన మార్కెట్లు నేడు దశ కోసం మరొక సారి ప్రపంచ మార్కెట్ల పై దృష్టి సారించ నున్నాయి. ఐతే మంత్రి చేసిన ప్రకటన పై స్పందిస్తూ అంతర్జాతీయ సంస్థ " మూడి" ప్రస్తుతం వున్న భారత దేశపు పరపతి ని BBB - రే టింగ్ నుండి కొంత మెరుగు పడాలంటే ద్రవ్యలోటు ని గణనీయం గా తగ్గించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. Mirae Asset Global Investment కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఐతే ఆర్ధిక ఉద్దీపనల ప్యాకేజీలు వలన దేశ బడ్జెట్ ద్రవ్యలోటు మరింత గా పెరిగేందుకు దోహద పడి చివరికి దేశపు ఆర్థిక పరపతి ని , FII ల దృష్టికోణం లో అతి కనిష్ట స్థాయి లో కొనసాగే విధం గా కారణ హేతువవ్వనున్నది.

ఈ అంశం ప్రధానం గా నేడు మార్కెట్ దృష్టి ని ఆకర్షించ నున్నది. ద్రవ్యలోటు తగ్గించే విధం గా PSU ల లో ప్రభుత్వ వాటా ల ఉపసంహరణల పై ప్రభుత్వం చూపే చిత్త శుద్ధి పై మార్కెట్లు నేడు నిశితం గా పరిశీలించ నున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ల పోకడలను పరిశీలిస్తే , FISHER సంస్థ UK దేశపు రేటింగ్ ని AAA నుండి తగ్గించే అవకాశం ఉందని తెలియచేసింది. ఈ కారణం గా అమెరికా డాలర్ విలువ కొంత పెరిగే అవకాశం ఉంది. ఐతే UK రేటింగ్ తగ్గితే ప్రపంచ మార్కెట్లు కొంత అతలాకుతలం అయ్యే ఆస్కారాలు వున్నా , ఆసియా మార్కెట్ల కు ముఖ్యం గా చైనా, భారత మార్కెట్లకు UK నుండి FII నిధులు మళ్ళే ఆస్కారం ఉంది. ఇదే సమయం లో భారత దేశం తన పరపతి ని పెంచు కునే చర్యలు చేపటితే నిధులు మరింత గా మన మార్కెట్లో కి ప్రవేశించవచ్చు. ఈ అంశం ప్రస్పుటం గా వచ్చే వారం నుండి మనకి కనపడవచ్చు. కాబట్టి మదుపర్లు , మార్కెట్లు పడినప్పుడు కొంత కొంత కొనుగోళ్ళు చేయవచ్చని మా అభిప్రాయం.

నేటి పరిస్థితిని సమీక్షిస్తే, గత రాత్రి అమెరికా మార్కెట్లు ,అక్కడి దిగ్గజ కంపనీల ఫలితాలు నిరాశ గొల్పే విధం గా ఉండటం తో నష్టపోయాయి. ఐతే ఆసియా మార్కెట్ల లో , ముఖ్యం గా జపాన్ లో స్టాక్ ఫ్యుచుర్స్ లో భారి గా పెరుగుదల నమోదు కావటం వలన , నేడు మన మార్కెట్లు కూడా ఆసియా మార్కెట్లకు అనుసంధానం గా, ప్రారంభ ట్రేడ్ లో కొంత పెరిగే ప్రయత్నం చేయవచ్చు. తదుపరి "Moody" ప్రకటన పై మన మంత్రుల స్పందన కీలకం కానున్నది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16441
  • అవరోధాలు: 16668-16754-16844
  • మద్దత్తులు:16340-16252 -16124-16064

11-11-2009 -free tips

  • ITI LIMITED

ఈ కౌంటర్ ప్రస్తుత మార్కెట్ ధర రూ. 48.95/- ఇది మరింత గా రూ. 64/-వరకు పెరిగే అవకాశం ఉంది. కాగా రూ 41.45వద్ద మద్దత్తు స్థాయి ఉంది. లాంగ్ పోసిషన్ ల కు స్టాప్ లాస్ 44.80/-వద్ద ఉంచుకొని ట్రేడ్ చేయవచ్చు. ఐతే ఈ కౌంటర్ రూ. 49.50 /- కీలక అవరోధం దాటటం ముఖ్యం .

  • IVR prime

ఈ కౌంటర్ ప్రస్తుత ధర రూ. 138.80 . ఈ కౌంటర్ ఒకటి రెండు రోజుల లో రూ. 153/- వరకు చేరుకునే అవకాశం ఉంది. స్టాప్ లాస్ రూ. 128.80 /

  • EPIC ENERGY.

ఈ కౌంటర్ cmp 41.20 /- . ఇది మరింత క్షీణించి రూ. 40 /- వరకు చేరుకోనున్నది. స్టాప్ లాస్ రూ. 41.60 /-