• 10-11-2009
  • మార్కెట్ రిపోర్ట్

ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖేర్జీ నేడు , అంతర్జాతీయం గా ఆర్ధిక మాంద్యం ఇంకా కొనసాగుతున్న దృష్యా దేశవాళి డిమాండ్ ఇంకా అవసరమని నొక్కి చెప్పటం తో గత ఐదు రోజులు గా లాభాలు గడించిన మన మార్కెట్లు నేడు నష్టపోయాయి. దీనితో మన సెన్సెక్స్ నేడు 58 పాయింట్లు నష్ట పోయి 16441 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 17 పాయింట్లు నష్ట పోయి 4882 పాయింట్ల వద్ద ముగిసింది.

ఉదయం మేము సూచించిన విధం గా శుభారంభం చేసిన మార్కెట్లు ఆర్ధిక మంత్రి ప్రకటన వలన ఆటుపోట్ల కి గురి అయ్యింది. దీనితో ఒక దశ లో గరిష్టం గా 16677 పాయింట్ల కు చేరుకున్న సెన్సెక్స్ నష్టాలబాట పట్టి 16372 పాయింట్లవరకు పడిపోయింది. చివరకి 16440 పాయింట్ల వద్ద ముగిసింది. మేము ఉదయం సూచించిన అవరోధ స్థాయి ఐన 16668 పాయింట్ల అవరోదానికి నేటి గరిష్ట విలువ ఇంచు మించు సరిపోవటం గమనార్హం .

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.43 శాతం , స్మాల్ క్యాప్ రంగం 0.38 శాతం నష్టపోయింది.

సేక్టరాల్ ఇండెక్స్ ల లో నేడు రియాలిటీ రంగం అత్యధికం గా 2.77 శాతం నష్టపోగా , టెక్ రంగం 1.39 శాతం క్షీణించి రియాలిటీ రంగానికి తోడుగా నిలిచింది. కాగా PSU రంగం నేడు 1.97 %, మెటల్స్ 1.37 % మేరకు లాభపడ్డాయి.

సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే, హీరో హోండా 4.5 , అయిర్ టెల్ 3.3 శాతం క్షీణించాయి. కాగా టాటా మోటార్స్ 2.3 %, SBI 2.1 % చొప్పున లాభాలను ఆర్జించాయి.