- మార్కెట్ ముందుచూపు
- అక్టోబర్ 26 నుండి ౩౦ వరకు
గత వారం విడుదల ఐన కంపనీల రెండవ త్రై మాసిక ఫలితాలు మార్కెట్లను మిశ్రమంగా స్పందింప చేసాయి. కంపనీలు లాభాలను ప్రకటించినప్పటికీ , ఈ లాభాలు ఇతర ఆదాయాల వలన కలిగినది గా ఉండటం తో మార్కెట్లు కొంత బలహీనపడ్డాయి. సెన్సెక్స్ 500 పాయింట్ల కి పైగా నష్టపోయింది.
ఈ వారం కూడా కొన్ని ముఖ్యమైన కంపనీల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ అంశం గత వారం విధం గానే , ఈ వారం కూడా మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. స్టాకు ల వారిగా సంచలనం కనిపించనున్నది. గత శుక్రవారం రిలయన్స్ వాటా లు భారి గా క్షీణించాయి. కే. జి . బేసిన్ లో డి -6 బ్లాక్ గ్యాస్ వెలికి తీత లో రిలయన్స్ తో భాగస్వామి గా ఉన్న UK కి చెందిన హార్డీ ఆయిల్ వైదోలగటం చర్చనీయ అంశం గా మిగిలింది. హార్డీ ఆయిల్ -గ్యాస్ నిక్షేపాలు ఉండక పోవచ్చన్న అనుమానం తో వైదోలగటం జరిగింది. ఇప్పటివరకు రిలయన్స్ కూడా సుమారు 15 బ్లాకులను ప్రభుత్వానికి ఇటువంటి అంచనాల తో నే తిరిగి ఇచ్చి వేయడం జరిగింది. ఈ ప్రక్రియ లో సుమారు 1400 కోట్ల రూపాయల నష్టం RIL చవిచూసింది. ఐతే డి - 6 బ్లాకు లో మరో మూడు సార్లు ప్రయత్నం చేయనున్నట్లు రిలయన్స్ ప్రకటించటం గమనార్హం. ఇది ఇలా ఉండగా, రిలయన్స్ - RNRL వివాదం కూడా సుప్రీం కోర్ట్ లో నలుగుతున్నందున రిలయన్స్ వాటా ల పతనం భారి గా జరిగింది. ఈ అంశం రాగల రోజుల లో కూడా రిలయన్స్ ని, తద్వారా సెన్సెక్స్, నిఫ్టీ ల ని ప్రతికూలం గా ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ వారం మార్కెట్లు తీవ్ర ఆటు పొట్ల కి గురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. ఈ వారం టెలికాం కంపనీలైన IDEA, AIRTEL, RCOM లు తమ ఫలితాలను ప్రకటించ నున్నాయి. గత పది రోజులు గా క్షీణిస్తున్న ఈ స్టాకు ల తదుపరి గమనం ఈ ఫలితాలు నిర్దేశించ నున్నాయి. అంటే కాక జనవరి 14 న 3 జి స్పెక్ట్రం కేటాయింపు జరగనున్నది.ఈ అంశం వలన మార్కెట్లు టెలికాం స్టాకులు ఆటు పొట్ల కి గురి కానున్నాయి. అదే విధం గా మారుతి ఫలితాల లో నూరు శాతం వృద్ధి ని కనపరచటం వలన, ఈ వారం విడుదల కానున్న MNM, TATA MOTORS ఫలితాలు మార్కెట్ల దృష్టి ని ఆకర్షించే అవకాశం ఉంది, ఈ వారం 27 వ తేదిన RBI , పాలసీ విధానాన్ని ప్రకటించ నున్నది. గతం లో 9.5 % నుండి 5 % వరకు అంచలు వారిగా తగ్గించిన CRR రేటు ని మరల పెంచే అవకాశం ఉంది. ఇది సుమారు ౦.5 % మేరకు పెంచవచ్చని మా అంచనా. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ... ముఖ్యం గా మరొక సారి పెట్రో వడ్డన వంటి అంశాల వలన ద్రవ్యోల్బణం మరింత గా పుంజుకునే అవకాశం ఉంది కనుక RBI రేటు ని పెంచే దిశ గా అడుగులు వేయవచ్చు. ఈ అంశం బ్యాంకింగ్ వాటాలను ప్రభావితం చేయనున్నాయి.
అంచనాల కంటే తక్కువగా జి .డి .పి వృద్ధి తక్కువగా నమోదు కావటం వలన చైనా మార్కెట్లు కొంత బలహీన పడ్డాయి. కాగా బ్రిటన్ లో వరుసగా ఆరవ త్రై మాసిక గణాంకాలు క్షీణించి , ఈ సారి ౦. 4 % క్షీణత నమోదు చేసింది. ఈ కారణం గా ప్రపంచ మార్కెట్ల లో ప్రస్తుతం కొంత బలహీనత చోటు చేసుకుంది. ఐతే గురువారం F &O కారణం గా అంతర్జాతీయ పోకడల కంటే, ప్రధానం గా ROLL OVERS పై మార్కెట్ గమనం ఆధార పడి వుంది.
టెక్నికల్ గా పరిశీలిస్తే, గత వారం సెన్సెక్స్ 30 DMAవద్ద ముగిసింది. సెన్సెక్స్ నకు ఈ వారం 16683 , ఆ తరువాత 50 DMA ఐన 16252 పాయింట్ల మద్దత్తు కీలక పాత్ర పోషించ నున్నది. 16683-16843-17041-17373- సెన్సెక్స్ నకు కీలక అవరోధాలు కాగా 16613-16565-16340-16252 పాయింట్లు ముఖ్యమైన మదత్తు స్థాయిలు .16252 పాయింట్ల మద్దత్తు క్షీణిస్తే మార్కెట్లు దిద్దుబాటు కి గురి అవుతున్నాయని చెప్పవచ్చు.అప్పుడు సుమారు 15356 పాయింట్ల వరకు పడిపోయే అవకాశం ఉంది.