• 23-10-2009 :: 6:30 PM
  • మార్కెట్ రిపోర్ట్

రిలయన్స్ వంటి భారీ కంపనీల షేర్లు బలహీనపడటంతో స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 21 పాయింట్లు స్వల్పంగా బలపడి 16,810 వద్ద నిలించింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 8 పాయింట్లు లాభపడి 4,997 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.13 శాతం, నిఫ్టీ 0.17 శాతం మేరకు లాభపడ్డాయి.నిన్న 200 పాయింట్లకు పైగా నష్టపోయిన అనంతరం ఈ రోజు ఉదయం ఫ్లాట్ నోట్‌తో 16,796 వద్ద స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. అంతర్జాతీయ సానుకూల అంశాలతో ప్రారంభ ట్రేడ్‌లోనే సెన్సెక్స్ 217 పాయింట్లు బలపడి గరిష్ఠంగా 17,007 వద్దకు చేరుకుంది. అయితే మేము ఉదయం సూచించిన 17014 పాయింట్ల కీలక అవరోధం చెదించ లేక చితికల పడింది. .. ప్రత్యేకించి ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం.. రిలయన్స్ షేర్లలో విక్రయాల ఒత్తిడి పెరగటం ఇందుకు కారణం అయ్యింది . కే. జి. బేసిన్ జి-9 బ్లాకు లో 10 % వాటా కలిగిన UK కి సంబంధించిన HARDY OIL, ఒక చమురు బావిని పాడుపడినది గా గుర్తించి వదిలివేస్తున్న వార్త RIL వాటాల లో అమ్మకాల వత్తిడి ని పెంచింది. అలాగే కేపిటల్ గూడ్స్ దిగ్గజం భెల్, ఎల్అండ్‌టీల షేర్లు కూడా విక్రయాల ఒత్తిళ్లకు లోనయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్ 242 పాయింట్లు కోల్పోయి కనిష్ఠంగా 16,765 వద్దకు పడిపోయింది. చివరికి 16810 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ని ముగించింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.03 % , స్మాల్ క్యాప్ రంగం 0.34 % మేరకు లాభపడ్డాయి. ముందు చర్చించిన విధం గా నేడు చమురు మరియు గ్యాస్ ఇండెక్స్ అత్యధికం గా 2.71 % బలహీన పడగా, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 1.44 % నష్టపోయింది. నేటి ట్రేడింగ్ లో FMCG 3.03 % లాభం అర్జించింది. ఫార్మా కంపనీల మెరుగైన ఫలితాల నేపధ్యం లో హెల్త్ కేర్ ఇండెక్స్ 2.05 % వృద్ధిని నమోదు చేసింది.

సెన్సెక్స్ స్టాకు ల లో ITC 5%. MNM 2.8 % లాభపడగా , RIL 4 % , GRASIM 3.1 % మేరకు బలహీనపడ్డాయి.