- 26-10-2009
- మార్కెట్ నాడి
టయోట కంపనీ నికర లాభాలు భారి గా ఉండటం తో నేడు జపాన్ మార్కెట్లు, ఇతర ఆసియా మార్కెట్లు లాభాల లో నడుస్తున్నాయి. చైనా మార్కెట్ల లో తదుపరి బుల్ రన్ ప్రారంభమైనదని ఈలియట్ సూత్రాలు సూచిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంచనాల తో అక్కడి మార్కెట్లు సైతం లాభాల లో పయనిస్తున్నాయి. కాగా అమెరికా మార్కెట్ల లో స్టాక్ ల ధరలు వాటి న్యాయమైన ధర కంటే 40 % కంటే అధికం గా ఉన్నదని ప్రముఖ ఆర్ధిక వేత్త ఆండ్రూ స్మితేర్ ప్రకటన అక్కడి మార్కెట్లను ప్రతికూలం గా ప్రభావితం చేసాయి. ఈ పరస్పర విరుద్ధమైన ప్రపంచ అంశాల నడుమ నేడు మన మార్కెట్లు కొంత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ముఖ్యం గా రిలయన్స్ వాటా లో బలహీనత మార్కెట్ల ను ప్రభావితం చేయనున్నాయి.
ఆసియన్ సమావేశాల లో ప్రధాని ఉద్దేపన లు కొనసాగిస్తామని ప్రకటించటం మార్కెట్ల లో ఉత్సాహాన్ని నింప నున్నాయి. ఐతే రేపు ప్రకటించ బోయే RBI ద్రవ్య పరపతి విధానం దృష్టి లో ఉంచుకొని మార్కెట్లు కొంత ఆచి తూచి ట్రేడ్ అవ్వనున్నాయి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16810
- అవరోధాలు: 16844-16978-17014-17124
- మద్దత్తులు:16754-16613-16494