- 30-10-2009 :: 8 : 30 AM
- మార్కెట్ నాడి
గత రోజు మార్కెట్ల ముగింపు అనంతరం సెన్సెక్స్ సూమో వీరుడు రిలయన్స్ Q 2 ఫలితాలను విడుదల చేసింది. అంచనాలని నిరాశ పరుస్తూ ఫలితాలు ఉండటం తో నేడు రిలయన్స్ వాటా కొంత క్రుంగే అవకాశం ఉంది. మన మార్కెట్ల పై నేడు ఈ అంశం ,ప్రతికూలం గా ప్రభావితం చేయనున్నది.
ఐతే గత రాత్రి అమెరికా లో విడుదల ఐన GDP గణాంకాలు అమెరికా ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే మేరుగ్గా వుండటం తో , అక్కడి మార్కెట్లు లాభాలను ఆర్జించింది. నేడు ఆసియా మార్కెట్ల లో జపాన్ , అక్కడి నిరుద్యోగ గణాంకాలు తగ్గుతున్నట్లు గణాంకాలు విడుదల అవ్వటం తో , ఉత్సాహం గా ట్రేడ్ అవుతున్నాయి. ఈ అంశం ఇతర ఆసియా మార్కెట్ల పై కూడా సానుకూలం గా ఉన్నందున , నేడు ఆసియా మార్కెట్లు లాభాల దిశ గా నడుస్తున్నాయి.
పైన చర్చించిన పరస్పర విరుద్ధమైన అంశాల నడుమ ,మన మార్కెట్లు నేడు సతమత మవ్వనున్నాయి. గత నాలుగు రోజులు గా మార్కెట్ల లో ఏర్పడ్డ షార్ట్ ల ను , నేడు ట్రేడెర్లు కొంత మేరకు కవర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వారాంతం కనుక ఈ అంశం మరింత ప్రాముఖ్యత చోటుచేసుకోనున్నది.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16053
- అవరోధాలు: 16114-16261-16340-16494-
- మద్దత్తులు:16040-15973-15881-15685
గమనిక : మన తెలుగువారికి ఉపయుక్తం గా ఉండే విధం గా ఈ వెబ్సైటు తీర్చిదిద్దేందుకు నిరంతరం చేస్తున్న మా కృషి లో భాగం గా మీకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న సంకల్పంతో , అతి త్వరలో SMS ద్వారా stock tips అందించ నున్నాము . ఈ సేవలను ఉపయోగించుకోదలచిన వారు మీ mobile numbers & e-mail id లను వెబ్సైటు లో " సంప్రదించండి" పేజి ద్వారా రిజిస్టర్ చేసుకోగలరు. -www.telugustockmarket.com