- 30-10-2009 :: 6:15pm
- మార్కెట్ రిపోర్ట్
సానుకూల ఆసియా మార్కెట్ల ప్రభావం నేపధ్యం లో ఆరంభ శూరత్వం తో ప్రారంభమైన మార్కెట్లు నేడు చివరికి కుదేలు మన్నాయి. దీనితో బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ నేటి ట్రేడింగ్ లో 156 పాయింట్లు కోల్పోయి 15896 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 39 పాయింట్లు కోల్పోయి 4711 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 0.97 శాతం, నిఫ్టీ 0.82 శాతం కోల్పోయాయి.
బలమైన ఆసియా మార్కెట్ల ప్రభావం తో , ఉదయం మా అంచనాలకి అనుగుణం గా , షార్ట్ కవెరింగ్ నేపధ్యం లో మార్కెట్లు లాభపడ్డాయి. ఈ ప్రక్రియ లో సెన్సెక్స్ గరిష్టం గా 16360 పాయింట్ల వరకు ఎగబాకింది. ఐతే మధ్యాన్నం ఐరోపా మార్కెట్లు బలహీనం గా ప్రారంభామవ్వటం తో మన మార్కెట్ల లో మరొక సారి రిలయన్స్ కౌంటర్ లో అమ్మకాల వత్తిడి పెరగటం తో సెన్సెక్స్ కృంగి పోయింది. ఈ అంశం కూడా మేము ఉదయమే చర్చించటం గమనార్హం. దీనితో ఈ వారం పూర్తి గా భల్లూకల గుప్పెట్లో మార్కెట్లు నిలిచినట్లయ్యింది
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 0.54 % , స్మాల్ క్యాప్ రంగం 0. 77 % చొప్పున నష్టపోయాయి. నేడు సేక్టరాల్ ఇండెక్స్ ల లో ఆటో ఇండెక్స్ అత్యధికం గా ౦. 94 % లాభపడగా , బ్యాంకింగ్ ఇండెక్స్ ౦. 49 % శాతం లాభాలను నమోదు చేయ్సింది. కాగా నేటి ట్రేడింగ్ లో రిలయన్స్ ప్రభావం వలన చమురు మరియు గ్యాస్ ఇండెక్స్ అత్యధికం గా 2.79 % నష్టపోయింది. కాగా టెక్ ఇండెక్స్ 1 .93 % క్షీణించింది.
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే నేడు RCOM, BHARTI AIRTEL అత్యధికం గా 7.4 %, 6. 4 % చొప్పున క్షీణించాయి. కాగా STERLITE , ICICI BANK 3.4 %, 2.4 % చొప్పున వృద్ధిని నమోదు చేసుకున్నాయి.