- 29-10-2009 :: 6:30 pm
- మార్కెట్ రిపోర్ట్
బలహీనమైన ప్రప్రంచ మార్కెట్ల నేపథ్యం లో నేడు మన మార్కెట్లు వరుసగా నాలుగవ రోజు నష్టపోయాయి. సెన్సెక్స్ నేడు 231 పాయింట్లు క్షీణించి 16053 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 76 పాయింట్లు క్షీణించి 4751 వద్ద ముగిసింది. మా అంచనాలకి అనుగుణం గా నేడు ఆద్యంతం నష్టాలలో పయనించిన మార్కెట్లు , కనిష్టం గా 15993 పాయింట్ల వరకు పడిపోయింది. నేటి ఉదయం మేము సరిగ్గా ఈ విషయాన్నే ప్రస్తావించటం జరిగిందన్న విషయం విదితమే .మేము సూచించినట్లే , మా అంచనాలను నూటి కి నూరు శాతం సరిపోయే విధం గా సరిగ్గా 15993 పాయింట్ల వరకు పడిపోవటం నేటి ట్రేడింగ్ విశేషం.
నేడు ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల అయ్యాయి. ఈ దేశంలో నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతుండటంతో 17 అక్టోబర్‌తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం రేటు 0.30 శాతం పెరిగి 1.51 శాతానికి చేరుకుంది. అదే దీనికి ముందు వారంలో ద్రవ్యోల్బణం రేటు 1.21 శాతంగా ఉండింది. అక్టోబర్ 17తో ముగిసిన వారానికి టీ, మాంసం, పప్పు ధాన్యాలు, బెల్లంతోపాటు ఇతర ఆహార పదార్థాలు, నూనె ధరలు ఆకాశాన్నంటాయి . ఈ అంశం మార్కేట్లని ప్రతికూలం గా ప్రభావితం చేసాయి. అంతే కాక నేడు అక్టోబర్ తాలూకు F & O ముగింపు కూడా మార్కెట్ల లో అమ్మకాల వత్తిడి పెరిగేందుకు కారణమయ్యింది. నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1. 95 శాతం బలహీన పడగా, స్మాల్ క్యాప్ రంగం 1.29శాతం నష్టపోయింది.
సేక్టరాల్ రంగాల లో నేడు FMCG ఇండెక్స్ మినహా అన్ని రంగాలు కుదేలుమన్నాయి. FMCG ఇండెక్స్ స్వల్పం గా ౦.66 % లాభపడింది . కాగా నేడు కూడా రియాలిటీ రంగం దారుణం గా భల్లూకాల పంజాకి గురయ్యింది. ఈ ఇండెక్స్ అత్యధికం గా 6.40 % నష్టపోయింది. కాగా మెటల్స్ 2 .58 % బలహీనపడింది .
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే DLF , RCOM 6.8 % , 6.5 % చొప్పున నష్టపోగా, MNM , ONGC 3.9 %, 2.6 % చొప్పున లాభపడ్డాయి.