- 27-10-2009 :: 8:30AM
- మార్కెట్ నాడి
గత రాత్రి అమెరికా మార్కెట్లు, క్యాప్ మార్క్ దివాలా ప్రకటించటం వలన, గృహ రుణాల పై పన్ను మినహాయింపు ని తగ్గించాలని అక్కడి సెనేటర్ల యోచన వలన , నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు ల లో సైతం , గృహ నిర్మాణ ముడి సరుకుల కంపనీల తో పాటు కామో డిటి లు కూడా క్షీనిస్తున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్ల పై కూడా పడనున్నది. గత రెండు మూడు రోజులు గా బలహీనం గా వున్న మన మార్కెట్లు , ప్రతికూల ప్రపంచ మార్కెట్ల నేపథ్యం లో నేడు మరింత గా కృంగి పోయే అవకాశం ఉంది.
నేడు రిజర్వు బ్యాంక్ రెండవ త్రై మాసిక ద్రవ్య పరపతి విధానాన్ని విడుదల చేయనున్నది. ఈ అంశం మార్కెట్ నిశితం గా పరిశీలించ నున్నది. కాబట్టి ,నేడు బ్యాంకింగ్ స్టాకు లు స్పెకులేషన్ కి గురికానున్నాయి. రిజర్వు బ్యాంక్ విధానం మార్కెట్లకి సానుకూలం గా ఉంటే నేడు మార్కెట్ల కి కొంత ఊరట కలిగించే అవకాశం ఉంది.
ఇంటర్నెట్ అగ్రగామి సంస్థ గూగుల్ భారత దేశం లో 3 G సేవలను , దేశీయ టెలికాం కంపనీ భాగస్వామ్యం తో అందించే యోచన ఉన్నట్లు ప్రకటించింది. ఈ అంశం కూడా టెలికాం వాటాల లో కొంత సంచలనం సృష్టించనున్నది
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16740
- అవరోధాలు: 16754-16844-16978-17014
- మద్దత్తులు:16613-16494 -16340-16252