- 26-10-2009 :: 6: 30 PM
- మార్కెట్ రిపోర్ట్
నేటి ఉదయం మేము సూచించిన విధం గా మార్కెట్లు ఆటు పొట్ల కి లోనయ్యాయి. రిలయన్స్ వాటాల లో బలహీనత వలన మార్కెట్లు చివరికి అరుణ వర్ణం లో ముగిసింది. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 70 పాయింట్లు కోల్పోయి 16740 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 26 పాయింట్లు కొల్పోయి 4971 పాయింట్ల వద్ద ముగిసింది.
ఉదయం ప్రారంభ ట్రేడ్ లో లాభాల నుండి నష్టా ల లో పయనించిన మార్కెట్లు మధ్యాన్నం రాన్ బాక్సి మున్నగు ఫార్మ కౌంటర్ ల ఫలితాలు అద్బుతం గా ఉండటం తో కొంత పుంజుకొని గరిష్టం గా 16939 పాయింట్ల కు చేరుకుంది. ఐతే నేటి మా అంచనాలను నిజం చేస్తూ రిలయన్స్ వాటాల లో బలహీనత చోటు చేసుకుంది. రేఫినింగ్ మార్జిన్ల లో క్షీణత నమోదయ్యే సూచనల వలన ఈ కౌంటర్ క్షీణించింది. దీనితో సెన్సెక్స్ బలహీనపడి చివరికి నష్టాల లో ముగిసింది.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 1.8 % , స్మాల్ క్యాప్ రంగం 1.31 % చొప్పున బలహీనపడ్డాయి.
నేటి ట్రేడింగ్ లో రియాలిటీ ఇండెక్స్ అత్యధికం గా 4.59 % నష్టపోయింది. కాగా కన్సుమేర్ డ్యురబుల్స్ 2.38 % క్షీణించింది . నేడు FMCG 0.89 %, హెల్త్ కేర్ ఇండెక్స్ 0.87 % చొప్పున స్వల్పం గా లాభపడ్డాయి.
సెన్సెక్స్ స్టాకు లను పరిశీలిస్తే, నేడు DLF , JP ASSOCIATES 5.4 % , 3.4 % చొప్పున నష్టపోయాయి. కాగా టాటా మోటార్స్, టాటా స్టీల్ 1.9 % ,1.8 % చొప్పున లాభపడ్డాయి.