- 27-10-2009 :: 5 pm
- మార్కెట్ రిపోర్ట్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ద్రవ్యపరపతి విధానంలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలను నమోదు చేసుకుంది . నేడు నిర్వహించిన సమీక్షా సమావేశానికి అనంతరం ప్రకటించిన ద్రవ్యపరపతి విధానంలో కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అలాగే సీఆర్ఆర్, రెపో, రివర్స్ రెపో రేటు యథాతథంగా ఉంటాయని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే.. ఎన్ఎల్ఆర్‌లో స్వల్ప పెంపు ఉంటుందని ఆర్‌బీఐ ప్రకటించింది. దీనితో ఉదయం నుండి బలహీనం గా ఉన్న మార్కెట్లు , రిజర్వు బ్యాంక్ ప్రకటన అనంతరం కీలక మద్దత్తు స్థాయి లను కోల్పోయి దిద్దుబాటు కి గురి అయ్యాయి. దీనితో నేడు సెన్సెక్స్ 387 పాయింట్లు కోల్పోయి 16353 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 124 పాయింట్లు క్షీణించి 4847 పాయింట్ల వద్ద ముగిసింది. రిజర్వు బ్యాంక్ ప్రకటన అనంతరం నేడు రిల్యాలితి ఇండెక్స్ బాగా క్షీణించింది. ఈ రంగం అత్యధికం గా 6 .24 % నష్టపోయింది. కాగా ప్రపంచ వ్యాప్తం గా క్షీణిస్తున్న కామో డిటి ల కి అనుగుణం గా మెటల్స్ రంగం 5.82 % క్షీణించింది . నేటి ట్రేడింగ్ లో బుల్ల్స్ కి నిలువ నీడ లేకుండా అన్ని రంగాలు కుదేలుమనటం విశేషం.
నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం 3 .69 %, స్మాల్ క్యాప్ రంగం 4.42 % చొప్పున బలహీనపడ్డాయి.
మంచి ఫలితాను విడుదల చేసిన విప్రో నేడు 2.18 % వృద్ధిని నమోదు చేయగా, టాటా మోటార్స్ 1 .56 % లాభపడింది కాగా నేడు నష్టపోయిన సెన్సెక్స్ స్టాకు ల లో టాటా స్టీల్ 7.26 % క్షీణించి బావురుమంది.