- 28-10-2009 :: 8 : 30 am
- మార్కెట్ నాడి
అమెరికా మార్కెట్ల లో ట్రెజరీ వేలం లో అంచనాలను మించి డిమాండ్ పెరగటం తో దేశ ఆర్ధిక పరిస్థితి పై మరొక సారి సంశయాలు కలగటం తో అక్కడి మార్కెట్లు క్షీణించాయి. దీనికి తోడూ వినియోగ కాన్ఫిడెన్స్ గణాంకాలు కూడా బలహీనంగా ఉండటం తో మార్కెట్లు మరింత నష్టపోయాయి. ఇదే కారణం వలన నేడు జపాన్ మరియు ఇతర ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాట లో పయనిస్తున్నాయి.
నిన్న రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి విధానాన్ని అనుసరించి బలహీనపడ్డ మన మార్కెట్లు ,నేడూ రేపు కూడా, రేపు ముగియవలసిన అక్టోబర్ నెల కి సంబంధించిన డిరైవె టీవ్స్ దృష్టి లో నుంచి కొని మరింత అతలాకుతలం కానున్నది. ప్రతికూల ప్రపంచ మార్కెట్ల ప్రభావం నేడు భల్లూకాలకి (BEARS) మరింత సహకరించ నున్నాయి.
నేటి ట్రేడింగ్ లో 16252 పాయింట్ల మద్దత్తు స్థాయి అత్యంత కీలకం. ఇది కోల్పోతే మార్కెట్ల లో మరింత దిద్దుబాటు కి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
- నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
- గత ముగింపు: 16353
- అవరోధాలు: 16494-16613-16754
- మద్దత్తులు:16340-16252 -16124-16064-16002