• 23-10-2009 :: 9:30 AM

  • మార్కెట్ నాడి

అమెరికా లో క్రెడిట్ కార్డ్ కంపనీలు ఉత్తమమైన ఫలితాలు ప్రకటించటం తో గత రాత్రి NASDAQ, DOW, S &P మార్కెట్లు బాగా రాణించాయి. నిరుద్యోగ సమస్య తో ముడిపడి ఉన్న క్రెడిట్ కార్డు అప్పుల ఎగవేత అంశాన్ని గమనిస్తే, క్రెడిట్ కార్డు కంపనీలు, బ్యాంకులు లాభాలను ఆర్జించటం తో నిరుద్యోగ సమస్య తగ్గు ముఖం పడుతున్నదన్న అంచనాల తో అమెరికా మార్కెట్లు లాభాలను ఆర్జించాయి.

నేటి ఆసియా మార్కెట్లు కూడా , అమెరికా మార్కెట్ల జోరు ని కొనసాగిస్తున్నాయి. గత మూడు రోజులు మన మార్కెట్లు నష్టపోయినండున, నేడు మన మార్కెట్ల లో కొద్ది పాటి పుల్ బ్యాక్ ర్యాలీ కనిపించే అవకాశం ఉంది. సానుకూల ప్రప్రంచ మార్కెట్ల సంకేతాలు కూడా ఇందుకు ఉపకరించనున్నది.

ఐతే నిన్న విడుదల ఐన ద్రవ్యోల్బణ గణాంకాలు సూచించినట్లు ద్రవ్యోల్బణం లో పెరుగుదల కారణం గా రిజర్వు బ్యాంక్ వడ్డీ రేటుని అనుకున్నదాని కంటే ముందుగానే పెంచే అవకాశం ఉంది. ఈ అంశం పై ఈ నెల ఆఖరు న ప్రకటించ బోయే రిజర్వు బ్యాంక్ విధానాలు , దీని పట్ల మార్కెట్ల ముందస్తు అంచనాలు , మార్కెట్లను ప్రతికూలం గా ప్రభావితం చేసే అవకాశం లేక పోలేదు. పైగా గత కొన్ని నెలలు గా భారి వృద్ధి ని కనపరిచిన మార్కెట్ల లో చిన్ని పాటి దిద్దుబాటు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది.

టెక్నికల్ గా నిన్నటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ 15 DMA మద్దతు ని కోల్పోయి ప్రస్తుతం 30 DMA వద్ద స్థిరపడింది.గత ఆదివారం మార్కెట్ ముందుచూపు శేర్షిక లో చర్చించిన విధం గా 16613 పాయింట్ల స్థాయి నేటి ట్రేడింగ్ లో కీలకం. ఇది వీగి పొతే 50 DMA ఐన 19494 పాయింట్లు అతి కీలకం . ఇది కూడా నిలబడక పొతే ,మార్కెట్ దిద్దుబాటు కి గురి అవుతున్నదని చెప్పవచ్చు. ఐతే నేటి మార్కెట్ లో కొంత షార్ట్ కవేరింగ్ చోటు చేసుకునే అవకాశం ఉంది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16789
  • అవరోధాలు: 16844-16978-17014-17124
  • మద్దత్తులు:16754-16613-16494